24.9 C
Hyderabad
Saturday, October 24, 2026

Live Video

spot_img

ఆర్యవైశ్యుల సంక్షేమానికి పథకాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాలని సంబంధిత కార్పొరేషన్ను ఆదేశించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అడిగిన ప్రశ్నకు భట్టి సమాధానం ఇచ్చారు. వైశ్యుల సంక్షేమం అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు, ఖర్చు చేసిన నిధుల వివరాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. కార్యాలయం ఏర్పాటు, జీతభత్యాల కోసం 36 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం స్వయం ఉపాధి, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం పథకాలు డిజైన్ చేయాలని ఆదేశించామని, అవి రాగానే నిధులు కేటాయిస్తామని తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com