29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

సినీ పరిశ్రమకి ప్రభుత్వానికి వారధిగా ఉంటా – దిల్ రాజు

తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకు రావడానికి అందరి సహకారం అవసరమని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. బుధవారం ఆయ టీఎఫ్డీసీ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ టీఎఫ్డీసీ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానన్నారు. తెలుగు సినీ పరిశ్రమకి మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలని దిల్ రాజు ఆకాక్షించారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్య లతో పాటు డిస్టబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ సంస్కృతి చాటిచెప్పడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా దిల్ రాజు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com