గబ్బా టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. అయితే చాలాసార్లు వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించిందనే చెప్పాలి. లైట్ సరిగా లేని కారణంగా మ్యాచ్‌ను ముందుగానే ముగించారు అంపైర్లు. ఏదేమైనా 51/4 ఓవర్ నైట్ స్కోర్‌లో మ్యాచ్ ప్రారంభించిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అయితే నాలుగోరోజు కేవలం 201 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా. నిజానికి ఇంకా 193 పరుగులు వెనకపడే ఉంది రోమిత్ సేన. నిజానికి టీమిండియా పరువు కాపాడింది కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అనే చెప్పాలి. కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77 పరుగులతో రాణించడంతో ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది రోహిత్ సేన.
ప్రస్తుతం క్రీజులో జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ ఉన్నారు. ఆకాశ్ దీప్ 27, బుమ్రా 10 పరుగులతో ఆసీస్ బౌలర్లకు చివరిలో చిరాకు తెప్పించారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ 31 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక భారీ సిక్సర్ కొట్టాడు. మరోవైపు నాలుగో రోజు కేవలం ఒక్క ఓవర్ మాత్రమే వేసిన జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా మళ్లీ గ్రౌండ్‌లోకి రాలేదు. హేజిల్‌వుడ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం కష్టమేనంది క్రికెట్ ఆస్ట్రేలియా. సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచుల్లోనూ ఆడే అవకాశాలు కూడా కష్టమే అనిపిస్తోంది.
ఏదేమైనా ఫాలో ఆన్ తప్పదని అంతా అనుకుంటున్న సమయంలో బుమ్రా, ఆకాశ్ దీప్ జోడీ విలువైన పరుగులు రాబట్టారు. చివరికి నాలుగో రోజే ఆలౌట్ కాకుండా ఆటను ముగించారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కానీ ఫీట్‌ను సాధించింది ఈ జోడి.