36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

మాస్కో పేలుడులో కెమికల్ డిఫెన్స్ చీఫ్‌ మృతి.. ఎవరి కుట్ర?

రష్యా రాజధాని మస్కోలో ఓ పేలుడు జరిగింది. ఇది పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగినట్టు తెలుస్తోంది. మాస్కోలోని రాజ‌న్‌స్కీ ప్రాస్పెట్ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ పేలుడు వ‌ల్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో రష్యా రేడియోలాజిక‌ల్ కెమిక‌ల్ అండ్ బ‌యోలాజిక‌ల్ డిఫెన్స్‌ ఫోర్స్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఇగోర్‌ కిర్లోవ్‌ ఒకరు కాగా.. అతని అసిస్టెంట్ మరోకరు. అయితే ఈ పేలుడు వెనక పెద్ద కుట్ర ఉందని రష్యా అనుమానిస్తుంది. ఎందుకంటే ఉక్రెయిన్ ఇదే జనరల్‌పై ఈ పేలుడుకు 24 గంటల ముందు ఓ ఆరోపణ చేసింది. నిషేధిత రసాయన ఆయుధాలను కీవ్‌పై ప్రయోగించేందుకు జనరల్‌ అనుమతి ఇచ్చినట్లు ఆరోపించింది. అంతలోనే ఈ దాడి జరిగింది.

కిర్లోవ్‌ ఆఫీస్‌ ఎంట్రెన్స్ వ‌ద్ద పార్క్ చేసిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లో ఐఈడీని ఏర్పాటు చేసి రిమోట్‌తో పేల్చిన‌ట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల కిరిల్లోవ్‌.. 2017 నుంచి ర‌ష్యా కెమిక‌ల్ డిఫెన్స్ చీఫ్‌గా ఉన్నారు. యుద్ధక్షేత్రంలో ర‌సాయ‌నిక ఆయుధాలు వాడ‌డంలో కిర్లోవ్‌ ఎక్స్‌పర్ట్ అని తెలుస్తోంది. అంతేకాదు ఉక్రెయిన్‌లో ఉన్న అనేక ల్యాబ్‌ల‌ను అమెరికా ఆప‌రేట్ చేస్తున్నట్లు ఆయ‌న గ‌తంలో ఆరోపించారు. ఇవన్నీ పక్కన పెడితే సంచలన ఆరోపణలు రావడం.. అంతలోనే అతడిని అంతమొందించడంతో రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ వైపు అనుమానంగా చూస్తుంది. మరి ఉక్రెయిన్‌ చేసిన పనా? లేక ఉక్రెయిన్‌ను సాకుగా చూపించి మరే దేశమైన కథ నడుపుతుందా? అనేది త్వరలో తేలనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com