37.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

పవన్ కళ్యాణ్ పై కేసు పునర్విచారించాలి

హైకోర్టులో పిటీషన్ వేసిన అడ్వకేట్ జడ శ్రవణ్

ఎన్నికల సమయంలో మహిళావాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాలకు సంబంధించిన కేసు పునర్విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో మహిళా వాలంటీర్ల తరఫున వ్యాజ్యం దాఖలు చేశారు. వాలంటీర్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పై ఇప్పటి కూటమి ప్రభుత్వం కేస్ ఉపసంహరించుకుంది. అయితే పవన్ కళ్యాణ్ పై కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ఇద్దరు మహిళా వాలంటర్లు హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 30 వేల మంది మహిళలు కనపడకుండా పోవడానికి వారిని వ్యభిచార కూపంలోకి దించడానికి వాలంటీర్లు కారణమన్న ఆరోపణపై పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేశారు. అప్పట్లో గుంటూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్  ప్రధాన కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విషయమై గుంటూరులోని నాలుగవ అదనపు జిల్లా కోర్టు పవన్ కళ్యాణ్ కు సమన్లు కూడా జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకుంది. కేసు ఉపసంహరణపై పిటీషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు మాత్రమే చేయి తగిన పనిని గుంటూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు కేసు ఉపసంహరించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు అంటున్నారు. గుంటూరు జిల్లా కోర్టు పరిధి దాటి పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది అన్న పిటీషనర్లు 30 వేల మంది వాలంటీర్లను అవమానపరిచిన పవన్ కళ్యాణ్ పై కేసు ఉపసంహరించుకోవడం ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి అద్దం పడుతుందన్న పిటిషనర్లు అంటున్నారు. పిటీషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది జడశ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. బుధవారం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com