39.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

చట్టం తన పని తాను చేసిందా… ఎవరైనా చేయించారా…?

అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ

ఈ నేచర్ లో ఎక్కడో జరిగిన ఒక మూవ్ మెంట్ ఇంకెక్కడో జరగాల్సిన మూవ్ మెంట్ ని డిసైడ్ చేస్తుంది…. ఎవ్రీ ధింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్… తారక్ నటించిన ’నాన్నకు ప్రేమతో‘ సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్ ఇది. హీరో స్ట్రేటజిస్ట్ అనే అంశాన్ని ఎలివేట్ చెయ్యడానికి దర్శకుడు ఈ సంభాషణను ఆ సీన్ లో ఉపయోగించుకున్నారు. ఇప్పడు ఈ డైలాగ్ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే… శుక్రవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని వేదికగా ఓ ప్యాన్ ఇండియా స్టార్ హీరో సెంట్రిక్ గా జరిగిన సంఘటన అటు జాతీయ స్ధాయిలోనే కాకుండా ఇటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటనలను కూడా ప్రభావితం చేసింది. ఎలా అనుకుంటున్నారా… ఈ కథనం పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది.

జాతీయ స్ధాయిలో…

ఓవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. భారత రాజ్యాంగా దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగంపై వాడివేడిగ చర్చ జరుగుతోంది. శుక్రవారం ఉదయం సభలో ఇదే అంశం మీద ప్రియాంక గాంధీ మాట్లాడారు. వయనాడ్ పార్లమెంట్ స్ధానం నుంచి భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన ప్రియాంకా గాంధీపై కాంగ్రెస్ పార్టీ గంపెడాశలు పెట్టకుంది. దానికి తోడు లోక్ సభలో రాజ్యాంగంపై శుక్రవారం ప్రియాంకా గాంధీది మెయిడిన్ స్పీచ్.. అంటే పార్లమెంటులో ఆమెది తొట్టతొలి ప్రసంగం. కాంగ్రెస్ శ్రేణులే కాకుండా దేశం మొత్తం చట్టసభలో ఆమె తొలి ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆశించినట్లుగానే ప్రియాంకా తన స్పీచ్ ఉపమానాలు, అధికార పక్షంపై విరుపులతో అదరగొట్టింది. కానీ ఏం ప్రయోజనం శుక్రవారం లోక్ సభలో ప్రియాంకా గాంధీ రాజ్యాంగంపై చేసిన ప్రసంగం దేశ ప్రజలకు సరిగా చేరలేదు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఒక సంఘటనే. ప్రియాంకా గాంధీ స్పీచ్ ప్రారంభం అవ్వడానికి దాదాపుగా పది నిమిషాల ముందు జాతీయ స్ధాయిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అల్లు అర్జున్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే రెండు తెలుగు రాష్ట్రాల మీడియాకే కాకుండా జాతీయ మీడియాకు కూడా మసాలా దొరికింది. తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా రోజంతా అల్లు అర్జున్ అరెస్ట్ వార్తల మీదే తమ ప్రసారాలను నడిపించాయి. దీంతో లోక్ సభలో ప్రియాంక వాద్రా స్పీచ్ కాస్తా సభకే పరిమితం అయింది.

ఆంధ్రప్రదేశ్ లో…

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణ మాదిరే అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వా నానా అన్న రీతిలో రాజకీయ పోరాటాలు చేస్తున్నాయి. అధికార పక్షాన్ని ప్రతి అంశంలో నిలదీస్తూ… ఎప్పటికప్పుడు అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై కౌంటర్లు ఇస్తే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎవర్ యాక్టీవ్ గా ఉంది. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వాన్న ప్రశ్నిస్తున్న వైసీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నా వెరవకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మరీ అధికార పార్టీపై పోరాటాలు ప్రారంభించింది వైఎస్సార్సీపీ. ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పండగ అయిన సంక్రాతి తరువాత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి స్వయంగా ప్రజల్లోకి వెళ్ళాలని, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అధికార పార్టీ అక్రమాలపై పోరాటాలు చెయ్యాలని షెడ్యూల్ వేసుకున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ప్రజాకంటక నిర్ణయాలపై క్షేత్ర స్ధాయిలో పోరాటాలు చెయ్యడానికి ఆ పార్టీ నేతలకు కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించారు. అందులో భాగంగానే శుక్రవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలపై ధర్నాలు చెయ్యడంతో పాటు ఎడ్లబండ్లపై ర్యాలీలు నిర్వహించి ప్రతి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకుంది. అనుకున్నట్లుగా ఉదయం పది గంటలకే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దయెత్తున ఎక్కడిక్కడ రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు ప్రారంభించారు. అయితే కొద్ది సేపటికే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం… మీడియా దృష్టి అంతా అటువైపు మళ్ళడంతో వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు మరుగున పడిపోయాయి. ఇదే అంశాన్ని ఆ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ప్రస్తావించారు. ఏది ఏమైనా ఇదంతా యాధృచ్చికంగా జరిగిందా. లేకపోతే టైం చూసి ఎవరైనా గేం ఆడించారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు తెలుగు రాష్ట్రల్లో కూడా అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాన్య ప్రజానీకంలో కూడా ఇదే తరహా చర్చ జరుగుతుందడటం విశేషం. అందుకే ’’ఈ నేచర్ లో ఎక్కడో జరిగిన ఒక మూవ్ మెంట్ ఇంకెక్కడో జరగాల్సిన మూవ్ మెంట్ ని డిసైడ్ చేస్తుంది…. ఎవ్రీ ధింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్‘‘ అనే ఫేమస్ డైలాగ్ గుర్తు చేసుకన్నది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com