33.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

గబ్బా టెస్ట్‌కు వరణుడి బ్రేక్..

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో జరిగుతున్న మూడో టెస్ట్‌కు తొలిరోజు వరణుడు బ్రేక్ వేశాడు. ఉదయం 5 గంటల 50 నిమిషాలకు.. మ్యాచ్ మొదలైంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమ్ ఇండియా.. మొదట బౌలింగ్ వేయాలని డిసైడ్ అయ్యింది. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా.. ఈసారి మాత్రం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మెక్ స్వీని వికెట్ పడకుండా ఆచితూచి ఆడారనే చెప్పాలి.

అయితే భారత బౌలర్లు వికెట్ల వేటలో.. ఆసీస్ ఓపెనర్లు పరుగులు వేటలో ఉండగా.. 19 పరుగుల వద్ద వర్షం ప్రారంభమైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేస్తుండగా.. ఆసీస్ బ్యాటర్లు వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. 13 ఓవర్లు పూర్తిగా కాగా వికెట్లు ఏమి నష్టపోకుండా 28 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. అయితే వర్షం మరోసారి మ్యాచ్‌కు బ్రేక్ వేసింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో తొలిరోజు ఆటకు బ్రేక్ ఇచ్చేశారు.

కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భాగంగా టీమిండియా వర్సెస్‌ ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇందులో మొదటి మ్యాచ్ లో టీమిండియా సాధించింది. అటు ఆస్ట్రేలియా రెండో టెస్టులో విజయం సాధించింది. అయితే, తుది జట్టులో టీమిండియా రెండు మార్పులు చేసింది. హర్షిత్ రాణా, రవిచంద్రన్ అశ్విన్ ను పక్కన పెట్టిన రోహిత్ శర్మ.. వారి స్థానంలో ఆకాష్ దీప్, రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com