సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనం కాగా తాజాగా న్యాయస్థానం బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. కొద్దిసేపటి క్రితం రిమాండ్ విధిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అల్లు అర్జున్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
అల్లు అర్జున్ భార్య స్నేహ ఉదయం ఇంటి దగ్గర అనుమాన పడ్డట్టుగానే జరిగింది. అరెస్టు చేస్తారా అని స్నేహ అనగా బన్నీ నవ్వుతూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు బన్నీ ముందే ఊహించినట్టుగా కనిపిస్తోంది.
ఈ కేసులో మొదటి ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్టు చేయటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేపు, ఎల్లుండి సెలవులు ఉండగా ఇంత తొందరగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
పుష్ప అరెస్టు వ్యవహారంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. థియేటర్ యాజమాన్యం భద్రత కోసం ముందుగా దరఖాస్తు చేసిన పోలీసులు పట్టనట్టు వ్యవహరించాని అంటున్నారు. అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.