24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

పుష్ప అరెస్టు అక్రమం… బన్నీకి మద్దతుగా తెలంగాణ నేతలు

పుష్ప మూవీ సీక్వెల్ తో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన అల్లు అర్జున్ ను అరెస్టు చేయటం వివాదాస్పదంగా మారింది. బన్నీకి మద్దతు పెరుగుతుండగా ప్రభుత్వం,పోలీసుల వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కెటిఆర్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా… హీరోని బాధ్యున్ని చేయటం సరికాదన్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు సక్రమమే అయితే హైడ్రా వ్యవహారంలో చనిపోయిన వారి విషయంలో సిఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్

సినిమా ధియేటర్ వద్ద తొక్కిసలాటకు ప్రభుత్వ ఫెయిల్యూరే కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను దుస్తులు కూడా మార్చుకోకుండా అరెస్ట్ చేయడం దారుణమని విమర్శించారు.

హరీశ్ రావు

సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్న మాజీ మంత్రి హరీష్ రావు… అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరని ప్రశ్నించారు.

దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సిఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరని ప్రశ్నించారు.

ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి? ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదన్నారు.

లక్ష్మీ పార్వతి

అల్లు అర్జున్ అరెస్టు పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని, అరెస్టులో చంద్రబాబు హస్తం ఉందన్నారు. సినిమా ఎలా ఉంది చూడటానికి అల్లు అర్జున్ వెళ్లినప్పుడు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేయని ప్రభుత్వానిది తప్పు అన్నారు. రాజమండ్రి పుష్కరాల్లో, కందుకూరు ఘటనల విషయంలో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఏపీలో చంద్రబాబు.. ఇక్కడ ఆయన శిష్యుడు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో రాక్షస పాలన సాగుతోందని లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పుష్పకు బాసటగా నిలిచారు. ప్రభుత్వం తగిన భద్రతా ఏర్పాట్లు చేయకుండా అల్లు అర్జున్ ను అరెస్టు చేయటం సరికాదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అరెస్టుపై స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని…నా జోక్యం ఏమీ ఉండదన్నారు.

మరోవైపు అల్లు అర్జున్ వ్యవహారంలో ఏపి ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం నర్మగర్భమైన ట్వీట్ తో చేతులు దులుపుకున్నారు. తెలుగుదేశం నాయకులు ఎవరు స్పందించలేదు. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి బన్నీ అమాయకుడన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com