ప్రతిష్టాత్మకమైన వైదిక సంశోధన మండలమ్ కు తెలుగు వ్యక్తి విరివెంటి సుబ్రహ్మణ్యం డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఈ వైదిక సంశోధన మండల సంస్ధ 1928వ సంవత్సరం ఆగష్టు 1వ తేదీన బాలగాంగాధార్ తిలక్ స్మృతిదినాన్ని పురస్కరించుకుని పుణేలో స్ధాపించబడింది. ఇంతటి ప్రతిష్టాత్మక సంస్ధకు మహబూబ్ నగర్ జిల్లా మార్చాలకు చెందిన విరివెంటి సుబ్రహ్మణ్యాన్ని డైరెక్టర్ గా నియమిస్తూ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయము నిర్ణయం తీసుకుంది. 1982 నుండి కేంద్రీయ సంస్కృతవిశ్వవిద్యాలయం అధీనములో వైదిక సంశోధన మండల సంస్ధ నడుస్తోంది. సుబ్రహ్మణ్యం ప్రస్తుతం హైదరాబాద్ సంస్కృత అకాడమీ లో గత 17 సంవత్సరములుగా డిప్యూటీ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. 2023వ సంవత్సరములో శైక్షిక, ప్రాశాసనిక సేవలను గుర్తించిన కేంద్రీయసంస్కృత విశ్వవిద్యాలయము శిక్షాశ్రీ అనే కులపతి పురస్కారముతో విరివెంటి సుబ్రహ్మణ్యాన్ని సత్కరించారు.