24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్ అరెస్టుపై కొత్త చర్చ

అల్లు అర్జున్ అరెస్టుతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ మొదలైంది. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ తప్పు లేదని అభిమానులు వాదిస్తున్నారు. పుష్ప2 తొక్కిసలాటకు… రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటను పోల్చుతూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన చర్చకు వస్తోంది. రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పూజ షూటింగ్ కోసం ఘాట్ ను మూసేయడమే తొక్కిసలాటకు కారణమని అప్పట్లో అరోపణలు వెల్లు వెత్తాయి. తొక్కిసలాటపై విచారణకు జస్టిస్ సోమయాజులు కమిషన్ ని అరునెలల గడువుతో నియమించినా…కమిషన్ విచారణ ఏమయిందో ఎవరికీ తెలియదని బన్నీ అభిమానులు ప్రస్తావిస్తున్నారు.

పుష్ప2 తొక్కిసలాటలో బన్నీని రిమాండ్ కు పంపిస్తే అంతకన్నా పెద్ద ఘోరానికి పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయరని బన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com