31.5 C
Hyderabad
Sunday, June 28, 2026

Live Video

spot_img

రోడ్లపై భగవద్గీత అమ్మడానికి వీలు లేదు – ఎమ్మెల్యే

ఇస్కాన్ సభ్యులను అడ్డుకున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి

అధికారం తలకెత్తితే దేవుడు కూడా కళ్ళకి చిన్నగానే కనపడతాడు. ఇప్పుడు ఇదే స్ధితిలో గుంటూరు పశ్చిమ నియోజవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి ఉన్నారు. మొన్న మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున గుటూరు పశ్చిమ నియోజవకర్గం నుంచి పోటీ చేసి మొదటి సారి శాసనసభ్యురాలిగా గెలుపొందిన గళ్ళా మాధవి, ఆమె భర్తు చుట్టూ మొదటి నుంచి వివాదాలు అలుముకుంటూనే ఉన్నాయి. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమ్యపై ట్రాఫిక్ పోలీసులతో కలసి కొరిటపాడు నుంచి గుజ్జనగుండ్ల వరకూ పరిశీలన చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్స్ పక్కన భగవద్గీత గ్రంధాలు విక్రయిస్తూ ఇస్కాన్ సభ్యలు ఎమ్మెల్యే శ్రీదేవికి కనిపించారు. వెంటనే వారి వద్దకు వెళ్ళి మీరు రోడ్ల మీద భగవద్గీత పుస్తకాలను ఎందుకు విక్రయిస్తున్నారని వాదనకు దిగారు. ప్రజలకు భగవద్గీతను దగ్గర చెయ్యాలనే ఉద్దేశంతో ఇస్కాన్ ఈ కార్యక్రమాన్ని చాలా ఏళ్ళుగా నిర్వహిస్తోందని ఇస్కాన్ సంస్ధ సభ్యులు ఎమ్మెల్యేకు వివరించారు. అయినా వినకుండా మీకు పుస్తకాలు రోడ్ల మీద అమ్మే హక్కు ఎవరిచ్చారని ఇస్కాన్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీద ఇలా పుస్తకాలు అమ్మడానికి వీలు లేదని ఇస్కాన్ సభ్యులను అడ్డుకున్నారు. భగవద్గీత పుస్తకాలు కొనమని రోడ్ల మీద మీరు ఎవ్వరినీ అడగవద్దని ఎమ్మెల్యే ఇస్కన్ సభ్యులకు అర్డర్ జారీ చేశారు. అయితే ఎమ్మెల్యే ప్రవర్తన పట్ల ఇస్కాన్ సభ్యులతో పాటు ఈ తతంగం గమనిస్తున్న పాదయారులు, వాహనదారులు కూడా విస్మయం వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com