ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి ముందకు వచ్చింది. ఈ మేరకు గూగుల్ గ్లోబల్ నెట్‌వర్కింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే బుధవారం అమరవతిలో చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. కృత్రిమ మేధ(AI) కార్యక్రమాలపై సహకరించే ప్రక్రియలో భాగంగా గూగుల్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య డిసెంబర్ 5న విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఈ బృందం పర్యటన జరిగింది. భారతదేశంలో గూగుల్ కార్యకలాపాలు,దాని భవిష్యత్తు ప్రణాళికలు మరియు ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ప్రతిపాదించిన వ్యూహాత్మక పెట్టుబడుల ప్రణాళికలపై ఈప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. గూగుల్ గ్లోబల్ నెట్వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఉపాధ్యక్షుడు బికాష్ కోలే మాట్లాడుతూ గూగుల్‌కు ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామి రాష్ట్రమని పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపట్టనున్న ముఖ్యమైన కొత్త కార్యక్రమాల గురించి ఆయన తన ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన నాయకత్వంలో చేసిన కృషి ఫలితంగా ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిపై ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఐటి రంగం గణనీయమైన అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. అంతేగాక దేశంలో ఐటీ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలా మారుస్తుందో సియం తెలియజేశారు. రాష్ట్రంలో గూగుల్ ప్రతిపాదించిన పెట్టుబడులను స్వాగతిస్తున్నట్టు సియం చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ సంస్థకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించనునచనట్టు సియం హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటి శాఖామాత్యులు నారా లోకేశ్ ఇటీవల తన అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ లీడర్‌షిప్‌తో తన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.అక్కడ గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించే అవకాశం కూడా లభించిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
- Advertisement with us -