37.2 C
Hyderabad
Friday, May 1, 2026

Live Video

spot_img

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయండి – సిఎస్

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రధమ స్నాతకోత్సవం సందర్భంగా ఈనెల 17వ తేదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సీయస్ నీరబ్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏ చిన్న పొరపాటుకు ఆస్కారం ఇవ్వకుండా రాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీయస్ అధికారులను ఆదేశించారు. 17వ తేదీ ఉదయం 11.20 గంటలకు ప్రత్యేక విమానంలో గననవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలదేరి మద్యాహ్నం 12.05 గంటలకు ఎయిమ్స్ ప్రాంగణానికి చేరుకుంటారు. ఎయిమ్స్ ప్రధమ స్నాతకోత్సవంలో పాల్గొని అనంతరం గన్నవరం విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమవుతారు. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికే ఏర్పాట్ల నుంచి మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవం పూర్తయ్యేవరకూ అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సీయస్ నీరబ్ కుమార్ అధికారులకు సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com