సానా సతీష్ అభ్యర్థిత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్న తమ్ముళ్ళు
వివాదాస్పద వ్యాపారవేత్త సానా సతీష్ ను తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అకస్మాత్తుగా పార్టీలో ప్రత్యక్షమై గత కొన్ని నెలలుగా చక్రం తిప్పుతున్న సానా సతీష్ పట్ల ఇప్పటికే టీడీపీ క్యాడర్ వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్నికల ముందు వరకూ కూడా జనసేన టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేసుకున్న సతీష్ ఇంత షడెన్ గా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఎలా మరో అర్ధంకాక తెలుగు తమ్ముళ్ళు తలలు బాదుకుంటున్నారు. అనతి కాలంలోనే యువరాజు లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా మారి అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ అన్నీ తనై సతీష్ వ్యవహరింస్తుండటం టీడీపీ సీనియర్ నాయకులకు మింగుడు పడటం లేదు. ఇంతకాలం రాజ్యసభ రేసులో గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య, కిలారి రాజేష్ తదితరుల పేర్లు వినిపించాయి. కానీ ఆకాశం నుంచి పడ్డట్లు సానా సతీష్ ఒక్కసారిగా లోకేష్ కోటరీ నంచి పడటంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అవాక్కవుతున్నారు. పోనీ స్వచ్ఛమైన, మల్లెపువ్వు లాంటి వ్యక్తికి ఇచ్చారులే అని సరిపెట్టుకోవడానికి లేదు. సానా సతీష్ బ్యాంక్ గ్రౌండ్ తలచుకుని కుమిలి పోతున్నారు తమ్ముళ్లు. ఏకంగా సీబీఐ తోనే ఆటలాడుకుని ఈడీ అరెస్ట్ చేస్తే బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తిని తీసుకువచ్చి ఏలా రాజ్యసభకు పంపారో అర్ధంకాక సీనియర్లు సైతం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
వాస్తవంగా చూస్తే సానా సతీష్ ది మామూలు హిష్టరీ కాదు. తండ్రి మరణంతో కారుణ్య నియామకం ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో చిన్న ఉద్యోంగంలో చేరిన సతీష్ కొద్ది కాలానికే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ కు మకాం మార్చాడు. కొద్ది కాలంలో పలు కంపెనీలు స్ధాపించాడు పార్టీలకు అతీతంగా అందరికీ తలలో నాలుకయ్యాడు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన ఇలా ఒక పార్టీ అని లేదు అన్ని పార్టీల్లో కీలక నేతలకు సన్నిహితుడయ్యాడు. జాతీయ స్ధాయిలో తన కార్యకలాపాలను విస్తరించాడు… ఉత్తర ప్రదేశ్ మీట్ ఎక్స్ పోర్ట్ కింగ్ ఖురేషీ దృష్టిలో పడ్డాడు… అతని తరపున సీబీఐ తో ఏదో డీల్ చెయ్యబోయి మరోదే డీల్ చేసి ఈడీ కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత బెయిల్ మీద వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించాడు. ముందుగా జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చెయ్యడానికి విశ్వప్రయత్నాలు చేశాడు.. అయితే పవన్ కళ్యణ్ అంతకు ముందే ఆ సీటును వేరే వ్యక్తికి మాట ఇవ్వడంతో అది సాధ్య పడలేదు. దీంతో లోకేష్ పంచన చేరి అతని కోటరీలో కీలక వ్యక్తిగా ఎదిగి ఇప్పుడు ఏకంగా రాజ్యసభ టిక్కెట్ కొట్టేశాడు. గత మే నెలలో కూటమి ప్రభత్వం కొలువు తీరిన తరువాత ఉన్నతాధికారుల బదిలీలు, సివిల్ సర్వెంట్ల పోస్టింగులు, కాంట్రాక్టులు, మైనింగ్ వ్యవహారాలు అన్నింటా తానై చక్కబెడుతున్నట్లు మీడియాలో కధనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే అవేవీ సానా సతీష్ రాజ్యసభ సభ్యత్వం సాధించడంలో ఆపలేకపోలేకపోగా అవే పెద్ద క్వాలిఫికేషన్లుగా తయారై అతన్ని రాజ్యసభకు పంపాయి అంటున్నారు టీడీపీ అభిమాన కార్యకర్తలు.