ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస్ చారి పై ఆశా వర్కర్స్ చేయి చేసుకోవడంతో పోలీసులు కూడా ఆమెపై చేయిచేసుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు ఆశా వర్కర్లకు18వేలు ఫిక్స్డ్ సాలరీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఈ రోజు ఆందోళన దిగారు. పెద్ద ఎత్తున వచ్చిన ఆశా వర్కర్లు రోడ్డుపై బైఠాయించగా…పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట…తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్లకు , పోలీసులకు మద్య వాగ్యవాదం జరిగింది.
ఈ క్రమంలో ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి క్రమంలో ఓ మహిళ చేయి డిసిఎం డోర్ లో చిక్కుకుంది. తీవ్ర స్థాయిలో ఆక్రందన చేసిన మహిళ ఆమె ముందున్న సిఐపై చేయిచేసుకున్నారని ప్రత్యక్ష సాక్షుల కథనం. సిఐ బలవంతంగా డోర్ వేయటం వల్లే ఆమె చేయిచేసుకున్నారని అంటున్నారు.
సిఐ మీద చేయిచేసుకోవడంతో పోలీసులు ఆమెపై చేయి చేసుకున్నారు. పురుష పోలీసులు చేయి చేసుకోవడం వివాదాస్పదం అయింది.