ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ వద్ద హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావం వల్ల డిసెంబర్ 15వ తేదీ వరకూ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటలకలో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడనుందని, డిసెంబర్ 11వ తేదీ నాటి అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల పట్ల రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాలకు ముందు వరి పంటను కోయవద్దని అధికారులు సలహా ఇచ్చారు.
- Advertisement with us -