ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన జరిగే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హజరు కావాల్సిందిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత,బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.
ఇదే అంశంపై కేసీఆర్ ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మేల్యే జీవన్ రెడ్డి, బి ఆర్ ఎస్ నాయకులు వంశిధర్ రావు తదితరులు..సాదర స్వాగతం పలికారు.
తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంధర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు హర్కర వేణుగోపాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులున్నారు.