డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య అన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. 2025 జనవరి మాసంలో యూపీ ప్రయోగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆహ్వానం పలికారు. తాను తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి శక్తి స్వరూపిణి దుర్గామాతను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పనిచేస్తున్నారని మౌర్య పేర్కొన్నారు. ఏక్ హై తో సేఫ్ నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి మహరాష్ట్రలో మూడోసారి విజయం సాధించామన్నారు. గంగా, యుమున, సరస్వతి నదులు సంగమించే ప్రయోగరాజ్ లో జగనవరిలో జరిగే కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి వివరించారు. ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్, సీయం చంద్రబాబునాయుడులను కుంభమేళాకు ఆహ్వానించడానికి తాను వచ్చినట్లు కేశవ ప్రసాద్ మౌర్య అన్నారు.
- Advertisement with us -