ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం – సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను సిట్ అధిపతిగా నియమించింది. ఈ బృందంలో బ్రిజ్‌లాల్‌తో పాటు.. సీఐడీ ఎస్పీ బి.ఉమా మహేశ్వర్, మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement with us -