34.1 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

బంగ్లా బరితెగింపు.. భారత భూభాగంపైకి డ్రోన్లు

బంగ్లాదేశ్ ఇప్పుడు భారత దేశానికి బద్ద వ్యతిరేకిగా మారుతుందా? మరో పాకిస్థాన్‌లా మన దేశానికి పక్కలో బల్లెంగా మారాలని చూస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకిలా చేప్పాల్సి వస్తోందంటే ఆ దేశం చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి. భారతదేశం నుంచి థ్రెట్ ఉందని భావిస్తూ ఏకంగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో డ్రోన్లను మోహరించింది ఆ దేశం. అంతేకాదు వీటిని వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్టు ప్రకటించింది బంగ్లాదేశ్ ఆర్మీ. దీంతో ఇండియన్ ఆర్మీ అలర్టైంది. ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. అంతేకాదు అవసరమైతే యాంటీ డ్రోన్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది.

టర్కీ నుంచి 12 బైరక్టార్ డ్రోన్లను కొనుగోలు చేసేంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇందులో ఆరు డ్రోన్లను ఇప్పటికే డెలివరీ ఇచ్చింది టర్కీ. ఈ డ్రోన్లను భారత్‌ సరిహద్దుల్లో మోహరించింది బంగ్లాదేశ్ ఆర్మీ. బెంగాల్‌ రాష్ట్ర సరిహద్దుల్లోని వ్యూహాత్మక ప్రాంతాల్లో ఈ డ్రోన్లు మోహరించి ఉన్నాయిని ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. వీటిపై పూర్తి నిఘా పెట్టామని.. అత్యవసరమైతే యాంటీ డ్రోన్స్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ డ్రోన్లను ఆపరేట్‌ చేసేది బంగ్లాదేశ్‌ ఆర్మీలోని 67వ ఆర్మీ డివిజన్. ఈ డివిజన్‌ ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్‌ మిషన్స్ నిర్వహిస్తుంటుంది. ఉన్న పళంగా భారత సరిహద్దుల్లో వీటిని మోహరించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తెర లేపుతోంది.

ఎప్పుడైతా ఆ దేశంలో హాసినా ప్రభుత్వం కుప్పకూలిందో అప్పటి నుంచి భారత్‌కు వ్యతిరేకంగా అడుగులు వేస్తోంది కొత్తగా వచ్చిన యూనుస్‌ తాత్కాలిక ప్రభుత్వం. ఇప్పటికే బైరక్టార్ డ్రోన్లు ఉక్రెయిన్‌లో వాటి సేవలందిస్తున్నాయి. ఒక్కో డ్రోన్ ధర 5.5 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందనేది ఓ అంచనా. ఈ డ్రోన్లను టర్కీష్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ చాలా ఆపరేషన్స్‌లో ఉపయోగించి సక్సెస్ అయ్యాయి కూడా. సిరియా, లిబియా, అజర్‌బైజాన్‌, ఇథియోపియా, ఖతార్, తుర్కమేనిస్థాన్, మొరాకో, కిర్గిస్థాన్, పోలాండ్, యూఏఈ, ఆఫ్రీకన్‌ దేశాల్లో కూడా ఈ డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com