27.7 C
Hyderabad
Monday, June 1, 2026

Live Video

spot_img

రికార్డులు తిరగరాస్తున్న పుష్ప2

అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప2 వెండితెరపై బ్లాక్ బస్టర్ గా రికార్డులు సృష్టిస్తోంది. భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. గతంలో రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును అధిగమించింది. పాన్ ఇండియా రికార్డుల బద్దలు కొట్టిన సుక్కు ద రూల్. 3 గంటల 20 నిమిషాలు ప్రేక్షకులను కట్టిపడేసింది. సుకుమార్ దర్శక చాతుర్యానికి తోడు నటనలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ఆకట్టుకుంది.

సినిమాలో జాతర సీన్ పంబ రేపింది. అమ్మవారి వేషంతో అల్లు అర్జున్ ఫైటింగ్ సీన్ మాస్ లో ప్రభంజనం సృష్టించింది. ఏ థియేటర్ వద్ద చూసినా కిక్కిరిసిన జనంతో జనసందోహం కనిపిస్తోంది. అభిమానుల ప్రశంసలు అందుకుంటున్న పుష్ప2 సినీ విమర్శకుల నుంచి 4.5 రేటింగ్ సాధించింది.

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రం మొదటిరోజు రూ.175.1 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ అద్భుతమైన కలెక్షన్ల‌తో ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉన్న అత్య‌ధిక‌ తొలిరోజు వసూళ్ల (రూ. 133 కోట్లు)ను ‘పుష్ప-2’ దాటేసింది.

లెక్కల మాస్టార్ లెక్కకే కొత్త నిర్వచనం ఇచ్చిన పుష్ప 2 సినిమా తొలిరోజు కలెక్షన్లు సింహభాగం తెలుగు వెర్షన్ ద్వారా వ‌చ్చాయి. తెలుగులో ఏకంగా రూ.95.1 కోట్లు రాబట్టింది. అలాగే హిందీ వెర్షన్ రూ.67 కోట్లు వ‌సూలు చేసింది. ఇక తమిళంలో రూ. 7 కోట్లు, కన్నడలో రూ. 1 కోటి, మలయాళంలో రూ. 5 కోట్లు రాబ‌ట్టింది. కాగా, ఈ వారాంతం ముగిసేలోపు రూ. 250 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్రిపుల్ ఆర్ వసూళ్లను సవాల్ చేసిన పుష్ప2… ఓవర్ సీస్ లో సుమారు 70 కోట్లకు చేరువలో వసూలు చేయగా ఉత్తరభారత దేశంలో 90 కోట్లకు చేరువలో కలెక్షన్స్ ఉన్నాయి.

మరోవైపు పుష్ప2 పాటలు రికార్డుల హోరు మోగిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే పాటలు 170 మిలియన్ల వ్యూవర్ షిప్ చేరుకున్నాయి. ట్రిపుల్ ఆర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 84 కోట్లు కాగా పుష్ప2 86 కోట్లకు చేరువైంది. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉండగా బన్నీ సింగిల్ గా దూకుపోతున్నాడని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.

అల్లు అర్జున్ నటనకు బన్నీ అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. యాక్షన్ నుంచి డాన్స్ వరకు మెగాస్టార్ ను తలపిస్తున్న బన్నీ రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ ఐకాన్ గా నిలుస్తాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com