27.7 C
Hyderabad
Monday, June 1, 2026

Live Video

spot_img

అంబేడ్కర్‌ దార్శనికతను కొనియాడిన కేసీఆర్‌

రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అజరామర కీర్తిని ప్రపంచానికి చాటేందుకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతగానో కృషిచేసిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తుచేశారు. అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే రాజ్యాధికారం సాధ్యమవుంతోందని కొనియాడారు. స్వాతంత్ర్యం తర్వాత స్వయం పాలనకు సంబంధించి ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించారన్నారు. అన్ని రంగాల్లోనూ అణగారిన వర్గాలకు సమానవాటా, సమన్యాయం దక్కేందుకు అంబేడ్కర్‌ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని కేసీఆర్ స్మరించుకున్నారు. అంబేడ్కర్‌ విశేష కృషిని, ఆయన దేశానికి అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే అత్యంత మహోన్నతమైన రీతిలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా మన తెలంగాణలో నిలుపుకున్నామన్నారు కేసీఆర్. అంటరాని వర్గాలుగా వివక్షకు గురయిన దళిత సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వారికి సామాజిక గౌరవం ఇనుమడింప చేసే దిశగా, బీఆర్‌ఎస్‌ హయాంలో అమలు చేసిన దళితబంధు పథకం.. అంబేడ్కర్ స్ఫూర్తితోనే అమలు చేశామన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com