తెలంగాణలో ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాల సందర్బంగా వైమానిక విన్యాసాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వైమానిక విన్యాసాలు నగర వాసులను అలరించనున్నాయి. అలాగే, ఇవాళ మిస్సయిన వారికి ఎల్లుండి ఆదివారం కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదు గంటల వరకు మరోసారి వైమానిక విన్యాసాలు జరుగుతాయి. హుస్సేన్ సాగర్ మీదుగా, సాగర్ పరిసరాల్లో ఈ వైమానిక విన్యాసాలు జరుగుతాయి. దీనికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.