ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అక్రమ రవాణపై 1066 కేసులు పెట్టామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. గురువారం విశాఖపట్నం కలెక్టరేట్లో నాదెండ్ల శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు కోటీ 20 లక్షల టన్నుల బియ్యం అక్రమంగా రవాణా అయినట్లు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల నుంచే కోటీ 69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి నాదెండ్ల అన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా అవ్వడంలో పలువురు అధికారుల హస్తం ఉందన్నారు. కృష్ణపట్నం, విశాఖ పోర్టుల నుంచి కంటే రెట్టింపు స్ధాయిలో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎక్కువగా అక్రమ రవాణా అవుతోందిన మంత్రి వివరించారు. పీడీఎస్ అక్రమ రవాణాపై సీఐడీ విచారణకు ఆదేశించామని, స్టెల్లా షిప్ లో అణువణువు తనిఖీలు చేస్తున్నమన్నారు. ఇకపై బియ్యం అక్రమ రవాణాదారులపై కఠినమైన పీడీ యాక్టులు పెడతామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
- Advertisement with us -