మహారాష్ట్ర పగ్గాలందుకుంటున్న దేవేంద్ర ఫడ్నవిస్ ఆ స్థాయికి అంత సులభంగా రాలేదు. ఏబీవీపి విద్యార్ది విభాగం లీడర్ స్థాయి నుంచి సీఎంగా ఎదగడం వెన కఠోర శ్రమ ఉంది.వాస్తవిక ధ్రుక్పథతంతో అడుగులేయడమే కాదు, న్యాయ కత్వ లక్షణాలు కూడా ఆయన్ను ఒక నేతగా ఎదిగేలా చేశాయి. ఫడ్నవిస్ కెరీర్ లో కూడా ఎన్నో ఉత్థాన పతనాలు ఉన్నాయి. మధ్యతరగతి బ్రాహ్మణకుటుంబంలో పుట్టిన ఫడ్నవిస్ చాలా చిన్న వయసులొనే రాజకీయాల్లోకి అడుగులేశారు. అప్పటికే రాజకీయాల్లో ఉన్న తండ్రి గంగాధర ఫడ్నవిస్ ను ఎమర్జెన్సీ టైమ్ లో జైలులో పెట్టారు. ఆ పరిస్జితులన్నింటిని చాలా దగ్గర నుంచి గమనించిన దేవేంద్ర కూడా తన అడుగులు రాజకీయం వైపే వేశారు.1989లో ఆరెస్సెస్ ఆధ్వర్యంలోని ఏబీవీపిలో చేరారు. 22 ఏళ్లకే నాగపూర్ లో కౌన్సిలర్ గా గెలిచారు. 27 ఏళ్లకి నాగపూర్ మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. నాగపూర్ చరిత్రలో ఫడ్నవిస్సే అతి పిన్నవయస్కుడయిన మేయర్.
ఇందిరపై ద్వేషంతో..
తండ్రి దేవేంద్ర ఎమర్జెన్సీ టైమ్ లో జైలు పాలు కావడంతో దేవేంద్ర స్కూలుకు వెళ్లడం మానేశారు.కారణం తాను చదివే కాన్వెంట్ పేరు ఇందిరా కాన్వెంట్ కావడమే. అప్పటి ప్రధాని ఇందిర పేరుతో ఉన్న కాన్వెంట్ లో చదివేది లేదని నాగ్ పూర్ లోనే ఉన్న సరస్వతి విద్యాలయలో చేరారు.న్యాయ వాద కోర్సులో డిగ్రీ తీసుకుని ఆపై బిజినెస్ మేనేజ్ మెంట్ చేశారు.
వాల్ పోస్టర్లు అంటించే స్థాయి నుంచి..
రాజకీయ జీవితం ఆరంభంలో దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ కార్యక్రమాల రాజకీయ పోస్టర్లను,పెయింటింగ్ లను గోడలపై అతికించేవారు. ఆయన కెరీర్ అంత అట్టడుగు స్థాయి నుంచి పైకొచ్చిందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. నాగపూర్ మేయర్ గా రెండు సార్లు పనిచేశారు. 2013లో మహారాష్ట్ర బీజేపి అధ్యక్షుడుగా ఎంపిక ఆయన కెరీర్ లో కీలకమైన మెట్టు. అది మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదగడానికి దోహద పడింది.2014కల్లా మహారాష్ట్ర 18 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఆయన నైజం 2022లో మరింత స్పష్టంగా కనిపించింది. ఏక్ నాథ్ షిండే మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం వెనకంజ వేయలేదు. డిప్యూటీ సీఎంగా తన మార్క్ చూపించారు. ఎన్నో మౌలిక వనరుల ప్రాజెక్టులను,రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యే చర్యలను చేపట్టి మహారాష్ట్ర పారిశ్రామిక పవర్ హౌస్ గా తీర్చి దిద్దారు.2019లో రెండోసారి సీఎం పదవి వరించినా అదికేవలం మూడు రోజులకు మాత్రమే పరిమితమైనా నిరుత్సాహ పడలేదు. తన రాజకీయ వ్యూహాత్మక అడుగులు ఆయన్ను రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ముందువరుసలోనే నిలబెట్టాయి.
ఫడ్నవిస్ ఆస్తులెన్ని?
ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం దేవేంద్ర ఫడ్నవిస్ ఆస్తుల నెట్ వర్త్ రూ. 13.27 కోట్లు.అప్పులు రూ.62 లక్షలు. 2023,2024 లెక్కల ప్రకారం ఫడ్నవిస్ మొత్తం ఆస్తుల విలువ రూ.79.03 లక్షలు. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.5 లక్షల బ్యాంకు డిపాజిట్లున్నాయి.బాండ్లు, డిబెంచర్ల రూపంలో స్టాక్ మార్కెట్ లో ఎలాంటి పెట్టుబడులు లేవు. భార్య అమ్రుతా ఫడ్నవిస్ కు మాత్రం బాండ్లు, షేర్లు, మ్యుుచువల్ ఫండ్స్ రూపంలో రూ.5.63కోట్లు ఉన్నాయి.ఫడ్నవిస్ కు ఎన్ ఎస్ ఎస్ పోస్టల్ సేవింగ్స్ అక్కౌంట్స్ లో రూ.17 లక్షలు, ఎల్ ఐసి పాలసీ రూపంలో రూ.3 లక్షలు ఉన్నాయి. ఇక చరాస్థుల విషయానికొస్తే దేవేంద్రఫడ్నవిస్ కు 450 గ్రాముల బంగారం, భార్యపేర 900 గ్రాముల బంగారం ఉంది.వీటి మొత్తం విలువ రూ.98 లక్షలు. వీరిద్దరి పేర్లపైనా ఎలాంటి కార్లు లేవు. స్థిరాస్థుల విషయానికొస్తే ఫడ్నవిస్, ఆయన భార్య పేరున రూ. 1.27 కోట్ల విలువైన వ్యవసాయ భూములున్నాయి.రూ.3కోట్లు, రూ.47 లక్షల విలువైన రెండు బంగ్లాలు ఉన్నాయి.
అరుదైన రికార్దుకు చేరువలో
రేపు మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపడుతున్న దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర చరిత్రలోనే సుదీర్ఘకాలం సీఎం పదవి చేపట్టిన నేతగా రికార్డులకెక్కుతున్నారు.గతంలో వసంత రావు నాయక్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 11 ఏళ్లు కొనసాగారు. కానీ ఇప్పుడు ఫడ్నవిస్ పూర్తికాలం కొనసాగితే 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న నేత అవుతారు.