28.7 C
Hyderabad
Tuesday, May 26, 2026

Live Video

spot_img

ప్రభుత్వానికి మద్యం వ్యాపారుల అల్టిమేటం

ఏపీలో మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కమీషన్ పెంచితే ఓకే.. లేదంటే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. కమీషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేమని తెగేసి చెప్పారు. కడపలో మద్యం వ్యాపారులు సమావేశమై ఈ అంశాలపై చర్చించారు. మద్యం షాపుల టెండర్‌కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమీషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమంటూ క్లియర్‌ కట్‌గా చెప్పేశారు.

రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమీషన్ ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా డిమాండ్‌ చేశారు మద్యం వ్యాపారులు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 9.5 శాతం కమీషన్ మార్చాలన్నారు. ఈ నెల 5వ తేదీన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వనున్నామని.. ఈ నెల 14వ తేదీలోపు కమీషన్‌ పెంపుపై నిర్ణయం తీసుకోక పోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com