36.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ప్రజా ప్రభుత్వానికి విద్య,వైద్యం రెండు కళ్ళు – భట్టి విక్రమార్క

బిజెపి, బీఆర్ ఎస్ లను రాష్ట్రానికి దూరంగా ఉంచితేనే రాష్ట్రం బాగుపడుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో నిర్వహిస్తున్న ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఆరోగ్య ఉత్సవాల”ను  సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం 213 నూతన అంబులెన్స్ లకు జెండా ఊపి ప్రారంభించారు. 16 నర్సింగ్ కళాశాలలను, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలను, 32 ట్రాన్స్ జెండర్స్ క్లినిక్ లను వర్చువల్ గా ప్రారంభించారు.

వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో నూతనంగా ఎంపికైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ లతో పాటు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి అభివృద్ది కార్యక్రమాలు చూసి తట్టుకోలేకనే విపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని ఘాటుగా విమర్శించారు.

ఉపముఖ్యమంత్రి ప్రసంగం ముఖ్యంశాలు.

ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఉద్యోెగ నియామక పత్రాలు తీసుకుంటున్న వారికి శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాలతోపాటు మధ్యతరగతి వర్గాల అవసరాలు తీర్చేందుకు సిఎం చొరవ తీసుకుంటున్నారు. మిగతా శాఖలకు నిధులు కొంత అటు ఇటు జరిగినా… వైద్యారోగ్య శాఖకు ఠంచనుగా నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు.

పేద వర్గాల్లో వైద్య అవసరాల కోసం దేవుడి మీద భారం వేయాల్సిన పరిస్థితుల నుంచి భయపడాల్సిన పనిలేదని రాజీవ్ ఆరోగ్య కింద పది లక్షలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానిది అన్నారు. గత పదేళ్లలో పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ చేయలేదు కాని ఇప్పుడు తగుదునమ్మా అని ధర్నాలకు దిగుతోందని విమర్శించారు.

ఏడున్నర లక్షల కోట్ల అప్పు మీద పడ్డా నెరవకుండా ప్రజల కోసం ముందుకు సాగుతున్నాం. వడ్డీ భారం పడుతున్నా ప్రభుత్వం వెనుకడుగు వేయలేదన్నారు. బిజెపి నేతలు ఎన్నికలకు ఎన్నో హామీలు ఇచ్చారని, రెండు కోట్ల ఉద్యోగాలన్నారు. నోట్ల రద్దు సమయంలో ఫలితాలు మూడు నెలల్లో వస్తాయని చెప్పారు పదేళ్లు గడిచినా అతీగతి లేదన్నారు. కేంద్రంలో ఎన్నో హామీలు ఇచ్చినా నెరవేర్చలేదని గుర్తు చేశారు.  పేదవాళ్ల అకౌంట్లో 15 లక్షల డబ్బులు వేస్తామని చెప్పి పదేళ్లు గడిచినా హామీ నెరవేర్చలేదు.

పైగా మేము హామీలు నెరవేర్చలేదని బిజెపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్, రైతులకు రుణ మాఫీ వరుసగా నెరవేరుస్తున్నామని తెలిపారు. స్వాతంత్యం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. ఏడాది కాలంలో 21 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కోసం రైతుల అకౌంట్లో జమ చేసిన దాఖల లేదు.

చెప్పుకుంటే చాలా ఉన్నాయని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేరుస్తున్నాం. పది నెలల్లోనే 55 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందచేశామని, పని లేని బిజెపి నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

పది ఏళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని బీఆర్ ఎస్ పై మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు మింగారని ఆరోపించారు. ప్రజల కోసం ఏమీ చేయని బీఆర్ ఎస్ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల డైట్ ఫీజులు పదేళ్లలో ఒక రూపాయి పెంచలేదు. మా ప్రభుత్వం ఒకటే దఫా 40 శాతం డైట్ చార్జీలు పెంచామని గుర్తుచేశారు.

విద్యార్థుల కోసం 5 వేల కోట్ల నిధులతో 30 సమీకత పాఠశాలలు మొదటి దఫా మొదలు పెడుతున్నందుకు గ్రామీణ ప్రాంత వ్యక్తిగా గర్విస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు పది వేల కోట్లతో అభివద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు.

కాకతీయుల చరిత్ర చెప్పి పబ్బం గడిపిన కెసిఆర్ వరంగల్ డెవలప్మెంట్ పట్టించుకోలేదని విమర్శించారు. వరంగల్ పట్టణానికి కెసిఆర్ ఏమి చేశారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుంటే తట్టుకోలేక ప్రజలను రెచ్చగొడుతున్నారని విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇదంతా చూస్తు ఊరుకోమని ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం పనిచేస్తామని పునరుద్ఘాటించారు. ఈ రాష్ట్రానికి రెండు కళ్ల లాంటి విద్య, వైద్యాన్ని ప్రభుత్వం బలోపేతం చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com