28.2 C
Hyderabad
Wednesday, September 16, 2026

Live Video

spot_img

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వ్యూహం వారిదే!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలయ్యింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే బీజేపీ, కాంగ్రెస్‌ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై దృష్టిపెట్టారు. ఇక, అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలెట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటివారంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీ 62 స్థానాల్లో గెలుపొందగా..బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. అయితే, ఆ తర్వాత సభలో బలాబలాలు మారిపోయాయి. కొందరు ఆప్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అయితే, ఇప్పుడు జరగనునున్న ఎన్నికల కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే ఆయా సీట్లలో అభ్యర్థులను ఖారారు చేస్తోంది. మొదటి విడతా నవంబర్21వ తేదీన 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు పార్టీ అధినేత కేజ్రీవాల్. త్వరలోనే మరో విడత అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల ప్రచారంలో ఉన్న కేజ్రీవాల్‌ గెలుపు గుర్రాలను అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ ఇండియా కూటమికి ఝలక్‌ ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో, ఇండియా కూటమికి, కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చినట్లయ్యింది.

అటు.. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సహా కీలక నేతలు హాజరయ్యారు. వచ్చేయేడాది మొదట్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీరియస్‌గా చర్చించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఎలా నిలువరించాలన్న అంశంపై కార్యాచరణ రూపొందించారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కూడా సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తు ఉంటుందనుకున్న కాంగ్రెస్‌ వ్యూహాలకు పదును పెట్టలేదన్న వాదనలున్నాయి. ఎలాగూ.. ఆప్‌ అధికారంలో ఉన్నందున.. ఆ పార్ట వ్యూహాల్లో భాగస్వామ్యమైతే చాలనుకున్నారు కాంగ్రెస్‌ పెద్దలు. కూటమి పొత్తు ఉంటే ఆప్‌, కాంగ్రెస్‌కు అన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండేదికాదు. కానీ, ఇప్పుడు ఆప్‌.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. దీంతో, కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి యాక్టివ్‌ అవుతోంది.

 

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com