33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

కుమారుడి కోసం మాట తప్పిన బైడన్….ట్రంప్ ఆగ్రహం

అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట తప్పాడు. కన్న కొడుకు జైలుకు పోకుండా ఉండేందుకు యూ టర్న్ తీసుకున్నాడు. గతంలో చెప్పిన మాటలను పక్కన పెట్టి.. ఏకంగా అమెరికా అధ్యక్షుడికి ఉండే ప్రత్యేకాధికారాలను ఉపయోగించి క్షమాభిక్ష ప్రసాదించాడు. తన కుమారుడు హంటర్‌ బైడెన్‌పై ఉన్న రెండు క్రిమినల్‌ కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించారు. తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఓ ప్రకటన కూడా చేశాడు. అక్రమంగా తుపాకీ కొనుగోలు, ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్‌, కాలిఫోర్నియాలో హంటర్‌పై కేసులు నమోదయ్యాయి. ఆయుధం కొనుగోలు వ్యవహారంలో నమోదైన కేసులో హంటర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అయితే ఇప్పటి వరకూ శిక్ష మాత్రం ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో బైడెన్‌ స్పందిస్తూ.. హంటర్‌ దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్ష ఇవ్వనని క్లియర్ కట్‌గా చెప్పారు. ఇప్పుడు మాత్రం అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశాన్ని వినియోగించుకున్నారు. బైడెన్‌ నిర్ణయంపై అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది.

బైడెన్‌ నిర్ణయంపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమని, బైడెన్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీవ్రంగా మండిపడ్డారు. హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జే-6 బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదు..? కుమారుడి విషయంలో బైడెన్‌ తీసుకున్న నిర్ణయం పూర్తిగా న్యాయవిరుద్ధం, అధికార దుర్వినియోగం… అని ట్రంప్‌ పోస్ట్‌ పెట్టారు. జే-6 బందీలు అంటే 2021 జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌లో ట్రంప్‌ తరఫున అల్లర్లలో పాల్గొన్నవారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com