నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర తమిళనాడు మీదుగా పుదుచ్చేరి సమీపంలో కారైకల్ మహాబలిపురం మద్య వాయుగుండగా బలహీనపడి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 240 కి.మీ, నాగపట్నానానికి 330 కి.మీ, పుదుచ్చేరికి 390 కి.మీ, చెన్నైకి 430 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఇవాళ తీవ్ర వాయుగుండం గానే కొనసాగే అవకాశం ఉందని, రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో వాయుగుండంగా బలహీనపడి తీరం దాటే అవకాశం ఉందని అంటున్నారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు,మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా . మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు జారీ చేసిన అధికారులు..తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రానున్న వాయుగుండం తీవ్రత దృష్ట్యా రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్. విజ్ఢప్తి చేశారు.