38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

ఖేలో ఇండియా గేమ్స్ @హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుకూలంగా స్పందించింది. వచ్చే ఏడాది నిర్వహించేలా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా 2025లో బిహార్‌లో నిర్వహించేలా ఇప్పటికే నిర్ణయం జరగడంతో 2026లో హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ సింగ్ మాండవీయ సానుకూలంగా స్పందించి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డికి హామీ ఇచ్చారు. రాతపూర్వక విజ్ఞప్తిని జితేందర్‌రెడ్డి గురువారం (నవంబరు 28) కేంద్ర మంత్రికి అందజేసి వివరించగా పై స్పష్టత లభించింది.

హైదరాబాద్ నగరంలో 32వ జాతీయ క్రీడలు (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ లేఖలో ప్రస్తావించారు. క్రీడా రంగానికి గత పదేండ్ల పాలనతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏటా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్ తదితరాలను 2018 నుంచి క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పది రెట్ల మేర క్రీడల కోసం కేటాయింపులను పెంచామి, కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయని, పేరెన్నికగన్న స్టార్ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా రూపొందిస్తున్నదని, ఆ శాఖను స్వయంగా ముఖ్యమంత్రే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో వెల్లడించారు.

సరూర్‌నగర్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (ఎయిర్ కండిషన్డ్), సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ ట్రాక్, ఔట్ డోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు టెన్నక్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ గ్రౌండ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే సౌకర్యం, గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సుల అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, హాకీ టర్ఫ్, షూటింగ్ రేంజ్, ఉస్మానియా క్యాంపస్‌లో సైక్లింగ్ వెల్‌డ్రోమ్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, జింఖానా-2 గ్రౌండ్‌లో ఫుట్ బాల్ గ్రౌండ్‌తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్ వివరించారు.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com