ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత కార్యదర్శి మురళిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయనపై కేసు పెట్టి ఆరెస్ట్ చేశారు. గురువారం అర్ధరాత్రి వరకూ శ్రీకాకుళంలోని మురళి నివాసంతో పాటు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఆరు ప్రదేశాల్లో ఏకకాలంగా ఏసీబీ అధికారులు అర్ధరాత్రి వరకూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు అర్జించినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా అర్ధరాత్రి దాటిన తరువాత మురళిని అరెస్ట్ చేసి విశాఖపట్నం తరలించి ఏసీబీ న్యాయస్ధానంలో ప్రవేశపెట్టారు.
- Advertisement with us -