-
చార్మినార్ పరిధి గుల్జార్ హౌజ్‌లో చెలరేగిన మంటలు
-
తెల్లవారు జామున ఎగిసిపడ్డ మంటలు
హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలో ఘోర విషాదం జరిగింది. చార్మినార్ దగ్గర్లో ఉన్న గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుల్జార్ భవనం మొదటి అంతస్తులో తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 17 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా గుల్జార్ భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో. క్షతగాత్రులందరినీ ఉస్మానియా, మలక్‌పేట యశోద, డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరు ఘటనాస్థలంలో మరణించడగా.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చారు. గుల్జార్ భవనంలో చిక్కుకున్న వాళ్లందరినీ క్రమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పేందుకు 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకుంది. దీంతో, పరిసర ప్రాంతాల ప్రజలు కూడా శ్వాస తీసుకోవడంలో చాలాసేపు ఇబ్బంది పడ్డారు.
మృతుల వివరాలు :
రాజేంద్రకుమార్ (67)
అభిషేక్ మోదీ (30)
సుమిత్ర (65)
మున్నీబాయి (72)
ఆరుషి జైన్ (17)
శీతల్ జైన్ (37)
ఇరాజ్ (2)
హర్షాలీ గుప్తా (7)
రజిత అగర్వాల్ (36)
అన్య మోదీ (12)
పంకజ్ మోదీ (45)
ప్రహ్లాద్ (70)
వర్ష మోదీ (36)
ఇదిక మోదీ (8)
రిషభ్ (04)
ప్రథమ్ అగర్వాల్ (14)
ప్రియాంశీ అగర్వాల్ (06)
క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స :
ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉస్మానియా, డీఆర్‌డీవో అపోలో, మలక్‌పేట్ యశోద, బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి వంటి ఆసుపత్రుల్లో పలువురికి చికిత్స అందిస్తున్నారు.