22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

మెట్రో సెకండ్‌ ఫేజ్‌ సెకండ్‌పార్ట్‌కు రూ.19వేల కోట్లు

హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశలోని రెండవ భాగం (2బి) విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.19 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 86.5 కిలోమీటర్ల మేర మూడు కొత్త మెట్రో మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. జేబీఎస్ నుండి మేడ్చల్, జేబీఎస్ నుండి శామీర్‌పేట, శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో మార్గాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండగా, త్వరలో మంత్రివర్గ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపనున్నారు.

ఈ విస్తరణలో ప్రత్యేకంగా రూపొందించిన మూడు మార్గాల్లో గత ప్రణాళికలో ప్రతిపాదించిన డబుల్ డెక్ విధానానికి హెచ్ఏఎంఎల్ వెనక్కి తగ్గింది. హై ఎలివేటెడ్ స్టేషన్ల వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందని భావించి, సాధారణ ఎలివేటెడ్ మార్గాలకే ప్రాధాన్యం ఇచ్చారు. జేబీఎస్ నుండి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్ల మార్గంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దగ్గర భద్రతా పరిమితుల కారణంగా 1.5 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం ఏర్పాటు చేయనున్నారు. అలాగే జేబీఎస్ నుండి మేడ్చల్ మార్గం 24.5 కిలోమీటర్ల మేర ఉండగా, తాడ్ బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా సాగుతుంది. జేబీఎస్ వద్ద మూడు మార్గాలకు అనుసంధానం చేసి ప్రధాన రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళకలు రూపొందిస్తోంది.

శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మెట్రో మార్గంలో, టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండనుంది. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ వరకు ఎలివేటెడ్ మార్గంగా, అక్కడి నుంచి ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యగా 18 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గంగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం, కేంద్ర ప్రభుత్వం 18 శాతం భరించనుండగా, 48 శాతం బ్యాంకు రుణాలుగా, మిగిలిన 4 శాతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో సమకూర్చనున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com