ఆపరేషన్ సింధూర్ కారణంగా తలెత్తిన ఉద్రికత్తల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో మూసివేసిన 32 విమానాశ్రాయాలను వెంటనే తెరవాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. మే 7వ తేదీన పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్ర స్ధావరాలపై భారత వైమానికి దళం దాడులు చేసిన రోజే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 32 విమానాశ్రాయాలను మే 15వ తేదీ ఉదయం 5.39 గంటల వరకూ మూసివేయాలని ఏఏఐ నిర్ణయం తీసుకుంది. అంబాలా, అమృత్‌సర్, అధంపూర్, అవంతిపూర్, బఠిండా, భుజ్, హల్వారా, హిండన్, బీకనీర్, చండీగఢ్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, శ్రీనగర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), జోధ్‌పూర్,కేశోద్, కిషన్‌గఢ్, లేహ్, లూధియానా, కులు మనాలి (భుంతర్), ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పటియాలా, పోరుబందర్, రాజ్‌కోట్, సర్సావా, సిమ్లా, తోయిస్, ఉత్తరాలై ఉన్నాయి. అయితే ఈ 32 విమానాశ్రయాలను తక్షణం అందుబాటులోకి వస్తాయని ఏఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో ఉన్న ఈ 32 విమానాశ్రయాలను తెరవడానికి ఎయిర్ మెన్‌కు సోమవారం నోటీసు కూడా జారీ చేసింది.