34.2 C
Hyderabad
Thursday, April 30, 2026

Live Video

spot_img

ఆపరేషన్ సింధూర్ ఫేజ్ వన్ ఎలా జరిగిందంటే…

  • టార్గెట్ చేసినవి 9 కీలక ఉగ్రస్థావరాలు
  • ఎంచుకున్న సమయం అర్ధరాత్రి1.4 నిమిషాలకు
  • తుత్తునియలు చేయడానికి తీసుకున్న టైమ్ 25 నిమిషాలు
  • వాడిన ఆయుధాలు స్కాల్ప్, హామర్, లాయిటరింగ్ మ్యునిషన్స్
  • వీటిలో కొన్ని కొన్నవి.. మరికొన్ని తయారు చేసినవి
  • స్కాల్ప్ మిసైల్ తుపానులా విరుచుకుపడుతుంది
  • హామర్…ఇది పనిలో వెరీ వెరీ స్మార్ట్.. సైలంట్ కిల్లర్
  • లాయిటరింగ్ మ్యునిషన్స్..టార్గెట్ ఛేదించేందుకు సహకరిస్తాయి
  • నిఘా కు ఉపకరిస్తాయి..రిమోట్ తో ఆపరేషన్ సులభం..

పెడబుద్ధి ప్రదర్శిస్తున్న పాకిస్థాన్ పై ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టిన భారత్ అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడి వీర విహారం చేసింది. భారత్ దాటికి పాకిస్థాన్ అరకొర ఆయుధాలతో బదులివ్వలేక నానా పాట్లు పడుతోంది. దీనికి భారత్ వాడుతున్న ఆయుధాలేంటో తెలుసా? అత్యాధునిక కచ్చితత్వంతో కూడిన దీర్ఘకాలిక లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు.. భారత్ ను విజయపథం వైపు నడుపుతున్న ఆ ఆయుధాలేంటో ఇప్పుడు చూద్దాం..

భారత్ త్రివిధ దళాల సాయంతో ముప్పేట దాడి జరుపుతోంది. మనం వినియోగిస్తున్న ఆయుధాల్లో కొన్ని భూమిపైనుంచి, మరికొన్ని సముద్రంపైనుంచి, మరికొన్ని ఆకాశం నుంచి ప్రయోగిస్తున్నాం.2019 బాలాకోట్ తర్వాత మన యుద్ధ రీతి మారింది. కచ్చితత్వంతో టార్గెట్ ను మాత్రమే ఛేదించే ఆయుధాలను వాడుతున్నాం.. ఇది అమాయకులను బలి తీసుకున్నారంటూ పొరుగు దేశం నుంచి ఆరోపణలు రాకుండా ఉండేందుకు మనం తీసుకున్న తొలిచర్య. ఈ ఆయుధాలలో కొన్ని విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నవి.. మరికొన్ని మేకిన్ ఇండియాలో భాగంగా మనదేశంలోనే నిర్మితమైన ఆధునిక ఆయుధాలు. స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులతో పాటు హామర్ అనే కచ్చితత్వంతో కూడిన బాంబులు, అత్యాధునిక మందుగుండు సామాగ్రి ని భారత్ ఈ యుద్ధానికి వినియోగిస్తోంది. వీటిలో అత్యాధునిక మందుగుండు సామాగ్రి టార్గెట్ ను ఛేదించే వరకూ గాల్లో తిరుగుతూ నిర్దేశించిన టార్గెట్ దొరకగానే దాన్లోకి చొరబడి దానిని పేల్చేస్తుంది..

స్కాల్ప్ (తుఫానులా విరుచు పడేది)మిస్సైల్…

దీనినే స్టార్మ్ షాడో మిసైల్ అని కూడా పిలుస్తారు.ఇది గగనతలం నుంచి ప్రయోగించే దీర్ఘకాలిక లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక క్షిపణి. 250 కిలోమీటర్ల లక్ష్యాన్ని అత్యంత వేగంగా సునాయాసంగా ఛేదించేస్తుంది. ఇది చాల వేగంగా బలంగా లక్ష్య ఛేదన చేసే క్షిపణి.

హామర్ (స్మార్ట్ బాంబ్)…

హామర్ స్మార్ట్ బాంబ్ కఠినమైన లక్ష్యాలను ఛేదించే బాంబ్. ఇది కట్టుదిట్టంగా నిర్మించిన బంకర్లను,బహుళ అంతస్తుల భవనాలను తుత్తునియలు చేసేస్తుంది. దీనిని నిషేధిత జైషే మహమ్మద్ సంస్థ ఉగ్రవాదుల శిక్షణ కోసం వినియోగిస్తున్న భవనాలు, వారి రాకపోకల కోసం వినియోగిస్తున్న కేంద్రాలను మట్టు పెట్టడానికి వాడారు. బహావల్ పూర్,కోట్లి, ముర్దిక్,లాంటి కీలక ప్రాంతాలతో పాటు పాకిస్థాన్ లో మూడు, పీఓకేలో అయిదు ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను మన ఆర్మీ నేలమట్టం చేసేసింది. ఇవి మనం  ప్రయోగించిన ప్రదేశం నుంచి 50-70 కిలోమీటర్ల శ్రేణిలోని లక్ష్యాలను ఛేదిస్తాయి.

లాయిటరింగ్ మ్యునిషన్స్ (మందుగుండు సామాగ్రి)…

కమికేజ్ డ్రోన్లుగా పిలిచే ఈ పేలుడు సామాగ్రిని నిఘా కోసం, టార్గెట్ ను మన లక్ష్యంలోకి తెచ్చుకోడానికి వినియోగిస్తారు. ఈ డ్రోన్లు టార్గెట్ ఏరియాలను చేరుకుని వాటంతట అవే లక్ష్య ఛేదన చేస్తాయి లేదా రిమోట్ తో ఆపరేట్ చేస్తారు. వీటిని ప్రమాదాన్ని పసిగట్టడానికి వినియోగించి పొంచి ఉన్న ముప్పును నిర్వీర్యం చేస్తాయి.

ఈ మూడు రకాల ఆయుధాలతో దాడి జరిపి పాకిస్థాన్ ను  గుక్క తిప్పుకోలేని విధంగా దెబ్బ తీసింది. అయినా బుద్ధిరాని పాక్ సరిహద్దుల దగ్గర మన అమాయక పౌరులకు నష్టం కలిగిస్తుండటంతో భారత్ ప్రతిదాడులు మొదలు పెట్టింది. ఇది యుద్ధం రూపు తీసుకుంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com