39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

జవాను మురళీనాయక్ వీరమరణం

పాకిస్థాన్ జరిపిన దాడుల్లో తెలుగు జవాను వీర మరణం పొందారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళి నాయక్ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తండా గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళీ నాయక్ పాకిస్తాన్ జరిపిన దాడుల్లో మృతిచెందినట్లు సమాచారం.

అగ్నివీర్ పథకంలో భాగంగా మూడు సంవత్సరాల క్రితం ఆర్మీలో చేరిన మురళీ నాయక్
నాసిక్ లో శిక్షణ పొందాడు, అస్సాంలో పనిచేశాడు, జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ పాకిస్తాన్ తూటాలకు బలయ్యాడు.

ఈ సమాచారాన్ని అధికారులు బాధిత కుటుంబానికి తెలియజేయడంతో బోరున విలపిస్తున్నారు.అమర జవాన్ పార్థివదేహాన్ని రేపు గ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సైనికుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

దేశం కోసం వీర మరణం పొందిన జవాను మురళీ నాయక్ మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైఎస్ఆర్సిపి అధ్యకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. జవాను కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com