36.2 C
Hyderabad
Wednesday, April 29, 2026

Live Video

spot_img

సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డి ఇంటిలో పోలీసుల సోదాలు

సాక్షి ఎడిటర్ ధనుంజయ్‌ రెడ్డి విజయవాడ నివాసంలో పోలీసులు కార్డ్‌ ఆన్‌ సెర్చ్‌ పేరుతో సోదాలు  నిర్వహించారు. గురువారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో విజయవాడలోని ధనుంజయ్‌ రెడ్డి నివాసానికి చేరుకున్న పది మంది పోలీసులు ఫ్లాట్‌ లోకి వెళ్లి తలుపులు వేసుకుని సోదాలు నిర్వహించారు. అయితే తన ఇంటిపై సోదాలు చేయడానికి తనకు పోలీసులు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని ధనుంజయ్‌ రెడ్డి అంటున్నారు. ఇటువంటి చర్యలు పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని ఆయన అన్నారు. ఈవిషయంపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి ఫిర్యాదు చేస్తామని సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌ రెడ్డి తెలిపారు. అయితే సాక్షి ఎడిటర్‌ ధనుంజయ్‌ రెడ్డి నివాసంలో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేయడంపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. జర్నలిస్టులను భయభ్రంతులకు గురి చేసి వారిని అదపులో పెట్టుకోవాలన్న లక్ష్యంతో ఏపీ పోలీసులు బలవంతంగా ఇంట్లోకి చొరబడి తనిఖీలు చేశారని జర్నలస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ పోలీసుల తీరుపై జర్నలిస్టు, సంఘాలు, ప్రెస్‌ క్లబ్‌ లు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకి ఫిర్యాదు చేశాయి. ఏపీ పోలీసులు జర్నలిస్టుల వేధింపులు ఆపకపోతే జాతీయ స్ధాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com