కశ్మీర్ ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది భారత్. మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు కలిసి దాడులు చేశాయి. ఈ విషయాన్ని భారత రక్షణశాఖ అధికారికంగా ధ్రువీకరించింది. మొత్తం 9 ప్రాంతాల్లో ఈ దాడులు చేసినట్టు తెలిపింది. పాక్ ప్రజలపై, పాక్ ఆర్మీ స్థావరాలపై దాడులు చేయలేదని ప్రకటించింది. కశ్మీర్ ఉగ్రదాడులకు కారణమైన వారిని వదిలేది లేదని మరోసారి ప్రకటించింది కేంద్రం.
9 లక్ష్యాలు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా 9 లక్ష్యాలపై దాడులు చేసింది. ఈ 9 కూడా జైష్ ఇ మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహీదిన్ ఉగ్ర క్యాంప్‌లే అని తెలుస్తోంది. కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ఏరియాల్లో ఈ దాడులు జరిగాయి. JeM హెడ్‌క్వార్టర్స్ బహవల్పూర్‌లోనే ఉంటుంది.
బహవల్పూర్: అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపల ఉంటుంది. JeM హెడ్‌క్వార్టర్స్
మురిడ్కే: సాంబా సెక్టార్‌కు 30 కి.మీల దూరంలో ఉంటుంది. ( LeT క్యాంప్)
గుల్పూర్: పూంచ్-రాజౌరీ సెక్టార్‌కలోని LoCకి 35 కి.మీల దూరంలో ఉంటుంది.
సవాయి: POK కశ్మీర్‌లోని ప్రాంతం
బిలాల్ క్యాంప్: JeM లాంచ్ ప్యాడ్
కొట్లీ క్యాంప్: LeT బాంబర్ క్యాంప్, LoCకి 15 కి.మీల దూరంలో ఉంటుంది.
బర్నాలా క్యాంప్: Loc కి 10 కి.మీల దూరంలో ఉంటుంది.
సర్జాల్ క్యాంప్: అంతర్జాతీయ సరిహద్దుకు 8 కి.మీల దూరంలో ఉంటుంది.
మెహ్మూనా క్యాంప్: అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీల దూరంలో ఉంటుంది. ( హిజ్బూల ముజాహిదీన్ ట్రైనింగ్ క్యాంప్)
దాడులను పర్యవేక్షించిన ప్రధాని మోడీ
ఈ దాడుల్లో రఫెల్ ఫైటర్ జెట్స్ పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ఎయిర్‌స్పేస్ నుంచే ఈ దాడులను చేసినట్టు సమాచారం. ఇండియన్ నేవీ సహాయంతో ఎయిర్ ఫోర్స్ ఈ దాడులను చేసింది. ఈ దాడుల్లో భారత్ వైపు నుంచి ఎలాంటి నష్టం జరగలేదు. ఈ దాడులకు సంబంధించిన టార్గెట్‌లను R&AW అందించింది. వివిధ ఉగ్రవాద సంస్థల నేతలు ఉన్నారనే సమాచారం తెలుసుకున్న తర్వాతే దాడులు జరిగినట్టు సమాచారం. ఈ దాడులను ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా పర్యవేక్షించారు.