యెమెన్‌పై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్‌పై మిసైల్ దాడులు చేసిన హౌతీ రెబల్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 24 గంటల్లోనే ప్రతిదాడులు చేసింది ఇజ్రాయెల్. యెమెన్‌లోని తీర ప్రాంత నగరమైన హొడైడాపై బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ ఎయిర్‌ఫోర్స్.
ఈ దాడుల్లో హొడైడాలోని పోర్ట్‌ను టార్గెట్‌గా చేసుకుంది. అక్కడ నిల్వ ఉంచిన చమురు ట్యాంక్‌లను పేల్చేసింది. పోర్ట్ కార్యకలాపాలు దెబ్బతినేలా చేసింది.
ఇజ్రాయెల్‌లో అత్యంత రద్దీగా ఉండే బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై మిసైల్ దాడి చేశారు హౌతీలు. ఈ దాడిలో ఎయిర్‌పోర్ట్ రోడ్ ధ్వంసమైంది. నలుగురు గాయపడ్డారు. ఈ దాడి కారణంగా కాసేపు ఎయిర్ ట్రాఫిక్ నిలిచిపోయింది.
దాడి జరిగిన వెంటనే ఇది యెమెన్ నుంచి జరిగినట్టు గుర్తించింది ఇజ్రాయెల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్. అయితే పలుసార్లు ప్రయత్నించినప్పటికి ఈ మిసైల్‌ను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయని ఆ దేశ రక్షణశాఖ తెలిపింది. దాడి జరిగిన వెంటనే ఇది తమ పనే అని గర్వంగా ప్రకటించుకున్నారు హౌతీలు.
మిసైల్ దాడిపై వెంటనే స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ దాడి చేసిన వారు ఎవరో గుర్తించి.. కౌంటర్ అటాక్ ప్లాన్ చేయాలని ఆదేశించారు. చెప్పినట్టుగానే 24 గంటల్లో ప్రతిదాడులు చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ.