కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసిన భట్టి
తెలంగాణ రాష్ట్రానికి సౌర పంపు సెట్లను భారీగా కేటాయించాలని కేంద్ర రీన్యూవబుల్ ఎనర్జీ, ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి మూడు వినతిపత్రాలు సమర్పించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు కేంద్రం సహకారం అందించాలని డిప్యూటీ సీయం కేంద్ర మంత్రిని కోరారు. పిఎం కుసుం కంపోనెంట్ ఎ కింద 500 KW నుండి 2 MW ల సామర్థ్యం కలిగిన మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు సహకరించాల్సిందిగా కేంద్రమంత్రిని కోరారు. పిఎం కుసుం కంపోనెంట్ బి కింద ఒక లక్ష సౌర పంపు సెట్ల కేటాయింపు, పిఎం కుసుం కంపోనెంట్ సి కింద 2 లక్షల పంపు సెట్ల కేటాయింపు చేయాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి ఇచ్చిన వినతిపత్రాల్లో డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.