ప్రస్తుతం వాట్సప్ అత్యవసరమైనదిగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దలవరకూ అందరూ వాట్సప్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. చాటింగ్, కాలింగ్, డాక్యుమెంట్లు పంపించడం, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం వంటి అనేక అవసరాల కోసం రోజూ వాట్సప్ యూజర్లందరూ వినియోగించుకుంటున్న ఈ యాప్‌కు సంబంధించి మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది.
మే 5వ తేదీ నుంచి కొన్ని పాత మోడల్ ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిపివేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీంతో, ఇకపై వాట్సప్ యాప్‌కు సపోర్ట్ చేసే మొబైల్ డివైజుల సంఖ్య తగ్గనుంది. ముఖ్యంగా పాత ఐఫోన్లు వాట్సప్ సర్వీసులకు దూరం కానున్నాయి. ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6 వంటి పాత మోడల్స్‌లో ఇకపై ఈ యాప్ పనిచేయదు. అలాగే iOS 12.5 కన్నా పాత వర్షన్లు కలిగిన ఫోన్లలో కూడా వాట్సప్ సేవలు నిలిచిపోతాయి. ఈ ఫోన్లలో ఇప్పటికే యాప్ ఉన్నా, మెసేజ్‌లు, కాల్స్, వీడియో కాల్స్ పనిచేయవని సంస్థ స్పష్టం చేసింది.
ఇది వినియోగదారులకు కొంత అసౌకర్యం కలిగించవచ్చుగానీ, మెటా సంస్థ పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ తగ్గించడం ద్వారా యాప్ పనితీరును మెరుగుపర్చాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ మార్పులు ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులపై మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది. యాండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే మెజారిటీ యూజర్లు ఆండ్రాయిడ్ ఫోన్లే వాడుతున్నప్పటికీ వాట్సప్ సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ వాట్సప్ ఆధారంగా తమ డైలీ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా మెసేజ్‌లతో పాటు హెచ్‌డీ ఫొటోలు, వీడియోలు పంపించడమే కాకుండా, యూపీఐ ద్వారా డబ్బులు పంపుకునే సదుపాయం కూడా ఉంది.
అయితే, వాట్సప్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవసీ పరంగా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫేక్ మెసేజ్‌లు వంటి వాటి నుంచి దూరంగా ఉండాలని చెబుతున్నారు. మెటా సంస్థ ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ, ప్రతి యూజర్ కూడా తన ఖాతాను రక్షించుకోవడం అత్యవసరం. వాట్సప్ చాటింగ్‌లో వ్యక్తిగత సమాచారం ఎక్కువగా ఉంటే, అది కొన్ని పోలీస్ కేసుల్లో ఆధారంగా కూడా మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఎలాంటి తప్పు దారి పట్టించే చర్యలకు వాట్సప్‌ను వాడకూడదని హెచ్చరిస్తున్నారు.