పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకునే టైమ్ దగ్గర పడిందా? సైనికుల రివేంజ్ యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? ఈ నెల 9వ తేదీన జరగనున్న రష్యా విక్టరీ పరేడ్‌కు మోదీ, రాజ్‌నాథ్ సహా భారత్ అగ్ర నేతలు ఎవ్వరూ వెళ్లడం లేదు. ప్రత్యేకంగా ఆహ్వానం వచ్చినా ఏ ఒక్కరూ ఆ వేడుకలకు హాజరు కావడం లేదు. రష్యా టూర్ రద్దు చేసుకుని మరీ ప్రధాని నరేంద్ర మోదీ అదే కసరత్తులో సీరియస్‌గా నిమగ్నమయ్యారా? భద్రత, యాక్షన్ ప్లాన్‌పై మోదీ, రాజ్‌నాథ్ నేరుగా సమీక్షించడంతో గంభీర వాతావరణం నెలకొంది.
మరోవైపు.. త్రివిధ దళాల అధిపతులతో మోదీ, రాజ్‌నాథ్ వరుస సమావేశాలు నిర్వహించారు. ఆ కీలక సమావేశాలు దాదాపుగా పూర్తయ్యాయి. దేశ విదేశాలతో దౌత్యపరమైన సంప్రదింపులు కూడా జరిగాయి. ఈ నెల 9వ తేదీ లోపు పాకిస్తాన్‌పై సైనిక చర్య ప్రారంభం అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడీ ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నాయి. ఎందుకంటే.. పాకిస్తాన్‌కు మోదీ నేరుగా వార్నింగ్ ఇచ్చారు. వినిపిస్తోందా.. పాకిస్తాన్? అంటూ ప్రశ్నించారు. అంటే.. ఆ సంకేతాలు వెలువడినట్లేనని అందరూ అనుకుంటున్నారు.
అసలు సైనికచర్య అంటే ఏంటి? డైరెక్టుగా ఉగ్రవాదులను లేపేస్తే.. అవి సర్జికల్ స్ట్రైక్స్. ఆ ఉగ్రవాదుల వెనుక ఉన్న పాక్‌కి బుద్ధి వచ్చేలా యుద్ధం ప్రకటిస్తే.. అది సైనిక చర్య. దీనికోసమే ఇప్పుడు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక కలలో కూడా ఊహించని రీతిలో ఉగ్రవాదులను శిక్షిస్తామని కొద్ది రోజుల క్రితమే బిహార్‌లో మోదీ చెప్పారు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలో నౌకా దళ సన్నద్ధతపై చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోదీతో జమ్ము కశ్మీర్ సీఎం అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మోదీతో ఇదే ఆయన తొలి సమావేశం కావడం గమనార్హం.