39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

కేటీఆర్‌కు జిమ్‌లో గాయం – పలువురి పరామర్శలు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గాయపడ్డారు. జిమ్‌లో వర్కవుట్‌ చేసన్న సమయంలో గాయమయ్యింది. వెన్నెముక డిస్క్‌కు గాయం కావడంతో కొద్దిరోజుల పాటు ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇదే విషయాన్ని కేటీఆర్‌ ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నానని కేటీఆర్‌ పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని తాను ఆశిస్తున్నట్లు ఆ పోస్ట్‌లో తెలిపారు.

ఎక్స్‌లో కేటీఆర్‌ పోస్టు చూసిన పలువురు ప్రముఖులు ఆయనను సోషల్ మీడియాలోనే పరామర్శిస్తున్నారు. కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టింది. ‘‘సోదరుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పవన్‌ పేర్కొన్నారు.

మరోవైపు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కూడా ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ను పరామర్శించారు. జిమ్‌లో వర్కవుట్‌‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు.

కాగా.. తమ నాయకుడు గాయపడటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. విషయం తెలుసుకున్న పలువురు భారాస నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈనెల 27వ తేదీ ఆదివారం వరంగల్ సభలో యాక్టివ్ గా పాల్గొన్న తమ నేత ఇంతలోనే గాయపడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com