36.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

సూర్యవంశీ వైభవం.. 14 ఏళ్లకే అదిరిపోయే రికార్డులు..

18 సీజన్లలో ఎవరూ చేయలేని ఫీట్‌ను చేసి చూపించాడు 14 ఏళ్ల బాలుడు. సీనియర్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. కొడితే సిక్స్‌ లేదంటే ఫోర్.. అన్నట్టుగా బాదుతూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాదేసి తన వైభవమేంటో చూపించాడు వైభవ్ సూర్యవంశీ. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం అదిరిపోయేలా.. ఐపీఎల్ రికార్డులు అదిరిపోయేలా.. భవిష్యత్తులో తన పేరును ఎవరు మర్చిపోకుండా చేసేలా బ్యాటింగ్ చేసి… ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌గా క్రికెట్‌లో ఓ సెన్సేషన్‌గా మారాడు వైభవ్.

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ ముందు ఉన్న 200 పరుగుల టార్గెట్‌ను ఆడుతూ పాడుతూ చేజ్‌ చేసేశాడు వైభవ్. క్రీజులోకి అడుగుపెట్టింది మొదలు సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్‌ఖాన్ లాంటి మేటి బౌలర్లను ఎదుర్కోంటూ.. ఒక్కో బాల్‌ను సిక్సర్‌గా మలుస్తుంటే యావత్ ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోయింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజం చెప్పాలంటే అతను ఆడుతుంటే మ్యాచ్‌ లైవ్‌లో చూస్తున్నట్టు లేదు.. జరిగిపోయిన మ్యాచ్‌ హైలేట్స్‌ చూస్తున్నట్టు ఉంది.

తొలి మ్యాచ్‌లో బాగా ఆడినా ఔట్ అవ్వడంతో ఎడుస్తూ పెవిలియన్‌కు వెళ్లిన సూర్యవంశీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ప్రత్యర్థి టీమ్‌ను ఏడిపించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్‌లో అతని ప్రస్థానమే ఓ హైలేట్ అని చెప్పాడు. ఈ బిహారీ కుర్రాడిని 14 ఏళ్లకే రూ.1.1 కోట్లకు దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్. తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయలేదు.

వైభవ్ రికార్డులు..

టీ 20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రికార్డు ఇప్పుడు వైభవ్‌ పేరుపైనే ఉంది. అంతకుముందు విజయ్ జోల్‌ పేరుపై ఈ రికార్డు ఉండేది. విజయ్ 18 ఏళ్ల 118 రోజులకు ఈ రికార్డు క్రియేట్ చేయగా.. వైభవ్ 14 ఏళ్ల 32 రోజులకు సెంచరీ బాదేశాడు. ఇక ఐపీఎల్‌లో ఈ రికార్డు మనీశ్ పాండే పేరుపై ఉండేది. అతను కూడా 19 ఏళ్లలో చేసిన సెంచరీని బీట్ చేశాడు వైభవ్.

ఐపీఎల్‌లో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వైభవ్‌ పేరుపైనే ఉంది. తొలి స్థానంలో గేల్ ఉన్నాడు. గేల్ 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వైభవ్ ఈ మ్యాచ్‌లో 101 పరుగులు చేశాడు. ఇందులో 94 పరుగులు ఫోర్లు, సిక్స్‌లే బాదాడు. ఒకే ఇన్నింగ్స్‌లో 11 సిక్స్‌లు బాదాడు వైభవ్. మురళీ విజయ్ పేరుపై ఉన్న ఈ రికార్డును ఇప్పుడు సమం చేశాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com