24.6 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

బాబ్బాబు.. కూంబింగ్‌ ఆపేయండి!

  • ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ లేఖ

  • శాంతి చర్చలకు ప్రతిపాదన

  • వరుస ఎన్‌కౌంటర్లలో బెంబేలు

మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అడవుల్లో మావోయిస్టుల ఏరివేత కోసం సాగిస్తున్న కూంబింగ్‌ నిలిపి వేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా తెంగాణ – ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న కూంబింగ్‌, వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో నేరుగా మావోయిస్టు పార్టీ లేఖ రాయడం చర్చను లేవనెత్తింది. శాంతి చర్చల కోసం ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కూడా ఆ లేఖలో మావోయిస్టు పార్టీ కోరింది. ప్రస్తుతం భద్రతా బలగాలు చేస్తున్న దాడులు నిలిపి వేయాలని విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కరెగుట్టల వద్ద జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మావోయిస్టు బస్తర్ ఇన్‌ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్‌నోట్ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని లేఖలో మావోయిస్టులు వినతి చేశారు. తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న సైనిక ఆపరేషన్‌ను వెంటనే ఆపాలని మావోయిస్టులు కోరారు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కొన్నాళ్లుగా మావోయిస్టుల కోసం జోరుగా ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలో కూడా రెండు మూడు సార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలని ఆపరేషన్స్‌ను వెంటనే నిలిపివేయాలని లేఖలో కోరారు. కానీ, ప్రభుత్వాల నుంచి రెస్పాన్స్‌ లేదు. దీంతో.. ఇప్పుడు మరోసారి లేఖ రాసినా.. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాంతి చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆపరేషన్ కగార్‌కు కూడా ఇబ్బంది ఏర్పడింది. దాదాపు 30 నుంచి 40 మంది జవాన్లు డిహైడ్రేట్‌ అయితే స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మరి.. మావోయిస్టు పార్టీ కోరిన విధంగా శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.

మావయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కర్రగుట్టలు కొనసాగుతోంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో మావోయిస్టు టాప్ సుప్రీం కమాండర్ హిడ్మా టార్గెట్‌‌గా గత మూడు రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. ఈ కూంబింగ్‌‌లో మొత్తం 10 వేల మంది భద్రతా బలగాలు పాల్గొంటున్నాయి. కర్రెగుట్టల్లో హిడ్మా, తెలంగాణకు చెందిన దామోదర్‌తో పాటు మూడువేలకు పైగా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ క్రమంలో గత మూడు రోజులుగా కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వైమానిక డ్రోన్ల సాయంతో మావోయిస్టులను తుదముట్టించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అడుగడునా ఉన్న ఐఈడీ బాంబులను డిస్పోజ్ చేస్తూ చాలా సాహసోపేతంగా ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టల చుట్టూ వేలాది మంది భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో వందల మంది మావోయిస్టుల చనిపోయే అవకాశం ఉందని పౌరహక్కు సంఘాలు ఆందోళనకు చేస్తున్నాయి. తక్షణమే ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పౌరహక్కు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com