31.7 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img

SRH కథ కంచికేనా? ప్లే ఆఫ్స్‌ చాన్స్ ఉందా?

SRH.. అరివీర భయంకరమైన బ్యాటింగ్ లైనప్‌ ఈ టీమ్ సొంతం. కాటేరమ్మ కొడుకులుగా.. ఐపీఎల్‌లో 300 రన్స్ కొట్టగలిగే చాన్స్ ఉన్న ఏకైక టీమ్‌గా పేరు సంపాదించుకున్న సన్‌రైజర్స్ హైదరబాద్‌.. ఇప్పుడ పాయింట్ల పట్టికలో లాస్ట్‌లో చేరింది. ఒక్కో మ్యాచ్‌ వరుసగా ఓడుతోంది. సొంత గడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ఓడింది. ఇది హైదరాబాద్‌కు ఆరో ఓటమి. ప్రస్తుతం SRH ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. ప్లే ఆఫ్స్‌ రేస్‌ నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే.

రాజస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 286 పరుగుల రికార్డ్ స్కోర్ చేసిన SRH.. ఆ తర్వాత వరుసగా ఓడింది. తిరిగి పంజాబ్‌ కింగ్స్‌పై 246 పరుగుల భారీ టార్గెట్‌ను చేజ్‌ చేసి తిరిగి లైన్‌లోకి వచ్చినట్టు కనిపించినా.. మళ్లీ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ ప్లేస్‌లో ఉంది SRH.

సన్‌ రైజర్స్‌ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాలి. SRH ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఈ ఆరుకు ఆరు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడిన ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైనట్టే. ఎందుకంటే అప్పుడు ఇతర టీమ్స్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.

ఇక్క మరో దారుణమైన విషయం ఏంటంటే.. SRH రన్‌రేట్‌ ప్రస్తుతం దారుణంగా ఉంది. ప్రస్తుతం SRH రన్‌రేట్ -1.361. కాబట్టి వచ్చే ఆరు మ్యాచ్‌లు వరుసగా గెలవడంతో పాటు.. నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటేనే ప్లే ఆఫ్ ఆశలు. లేదంటే గల్లంతే.

ఎందుకీ పరిస్థితి?

SRH ప్రధాన బలం బ్యాటింగే. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, నితీష్‌, క్లాసెన్.. ఇలా మంచి హిట్టర్లు ఉన్నారు. కానీ వీరేవ్వరూ కూడా వారి అంచనాలకు తగ్గట్టుగా ఆడటం లేదు. ముంబై మ్యాచ్‌లో క్లాసెన్ కాపడకపోతే.. హైయేస్ట్ స్కోర్‌తో పాటు.. లోయెస్ట్‌ స్కోర్‌ కూడా SRH పేరుపై ఉండేదే. ఇప్పటికైనా బ్యాటర్లు తమ బ్యాట్‌లకు పని చెప్పకపోతే ఆశలు అడియాశలే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com