24.5 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

ఉగ్రదాడిపై తీవ్రంగా మండిపడ్డ సీసీఎస్‌

  • దాడి చేసినవారినీ సూత్రధారలను ఎవ్వరినీ వదిలిపెట్టం
  • పాక్‌తో దౌత్య సంబంధాలపై ఆంక్షలు
  • ప్రధాని ఆధ్వర్యంలో జరిగిన సీసీఎస్‌ సమావేశం కీలక నిర్ణయాలు

పహల్గాం ఉగ్ర దాడిని భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందని నిర్ధారణకు వచ్చిన భారత ప్రభుత్వం ఆ దేశంపై తీవ్ర ఆంక్షలు విధించింది. పాకిస్తాన్‌ పౌరులు భారత దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి వెన్ను దన్నుగా ఉన్న పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలపై కూడా ఆంక్షలు విధించింది. కాశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో భద్రతా వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ సమావేశమై ఐదు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశాబ్ధాలుగా పాకిస్తాన్‌ తో ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేయాలని, అటారీ సరిహద్దు ప్రాంతాన్ని మూసివేయాలని, దౌత్య సిబ్బంది తగ్గింపు, పాకిస్తాన్‌ పౌరులకు భారత్‌ లో ప్రవేశాన్ని నిషేధించడం వంటి కీలక నిర్ణయాలను భద్రతా వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ తీసుకుంది. ఈ నిర్ణయాలతో ఇప్పటికే పాక్‌ తో అంతంత మాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలు మరింత క్షీణించనున్నాయి. ఇంతటితో ఆగకుండా పహల్గాం ఉగ్ర దాడికి దీటుగా బదులు ఇవ్వాలని క్యాబినేట్‌ కమిటీ నిర్ణయించింది. ఈ దిశగా ఏమేం చర్యలు తీసుకోవాలనే అంశంపై దాదాపు రెండున్నర గంటలకు సీసీఎస్‌ భీటీలో చర్చించారు.

ప్రధాని అధ్యక్షతన సమావేశం అయిన సీసీఎస్‌ లో హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, కేంద్ర క్యాబినేట్‌ కార్యదర్శి  టీవీసోమనాథన్‌, విక్రం మిస్త్రీ, రాజేశ్‌ కుమార్‌ సింగ్‌, ప్రధాని కార్యదర్శలు పీకే మిశ్రా, శక్తికాంత్‌ దాస్‌ తదితరలు పాల్గొన్నారు. పహల్గాంలో దాడి జరిగిన తీరును ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్‌ షా అందరికీ వివరించారు. అనంతరం దాడి విషయంలో భారత్‌ ప్రతిస్పందన ఏవిధంగా ఉండాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశం అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్త్రీ మాట్లాడుతూ పహల్గాం దాడిని సీసీఎస్‌ సమావేశం తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు సమావేశం ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు చెప్పారు. దాడిలో పాల్గొన్న తీవ్రవాదులతో పాటు ఉగ్ర దాడి సూత్రధారులను కూడా కఠినంగా శిక్షించాలని సీసీఎస్‌ సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com