31.7 C
Hyderabad
Friday, May 22, 2026

Live Video

spot_img

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్.. కీలక మార్పులు…

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ వచ్చేసింది. బీసీసీఐ నాలుగు కేటగిరీల్లో మొత్తం 34 మంది ప్లేయర్లకు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో చోటు ఇచ్చింది. A+, A, B, C కేటగిరిలుగా ప్లేయర్లను డివైడ్ చేసి.. అధికారికంగా అనౌన్స్ చేసింది. శ్రేయస్, ఇషాన్‌ కిషన్‌లకు మళ్లీ చోటు దక్కగా.. పాటీదార్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణాలకు తొలిసారి కాంట్రాక్టులు దక్కాయి.

గ్రేడ్ A+లో ఉన్న ప్లేయర్స్‌కి ఒక్కొక్కరికి ఏడాదికి రూ.7 కోట్ల వరకు బీసీసీఐ చెల్లిస్తుంది. చాలా తక్కువ మంది ప్లేయర్లే ఈ లిస్ట్‌లో ఉంటారు. ఇక గ్రేడ్ Aలో ఉన్న ఆటగాళ్లకు రూ.5 కోట్లు, గ్రేడ్ Bలో ఉన్న ఆటగాళ్లకు రూ.3 కోట్లు, గ్రేడ్ Cలో ఉండే ఆటగాళ్లకు రూ.1 కోటి చొప్పున బీసీసీఐ నగదు చెల్లించనుంది.

A+ కేటగిరీ

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా..  ఈ నలుగురూ A+ కేటగిరీలో చోటు ద‌క్కించుకున్నారు. ఇందులో హైలేట్ ఏంటంటే..  బుమ్రా మిన‌హాయిస్తే మిగ‌తా ముగ్గురు టీ20ల‌కు గుడ్‌బై చెప్పారు. మాములుగా అయితే మూడు ఫార్మాట్లు ఆడేవారినే ఈ కేటగిరిలో ఉంచుతారు. కానీ సీనియర్లు కావడంతో వీరికి మినహాయింపు ఇచ్చినట్టు కనిపిస్తోంది.

A కేటగిరీ

A కేట‌గిరీలో ఆరుగురు ప్లేయర్స్‌కి చోటు ద‌క్కింది. మ‌హ్మద్‌ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మ‌హ్మద్ షమీ, రిషభ్‌ పంత్ చోటు దక్కించుకున్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్ల వేతనం అందుతుంది.

B కేటగిరీ

B కేట‌గిరీలో టీమిండియా టీ20 టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.3 కోట్లు అందుతాయి.

C కేటగిరీ

రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేశ్‌ కుమార్, సంజూ శాంస‌న్‌, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్‌ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు ఇందులో చోటు దక్కింది. వీరికి ఏడాదికి రూ.1 కోటి చొప్పున బీసీసీఐ అందించనుంది.

కాంట్రాక్ట్‌ ఎలా ఫైనల్ చేస్తారు?

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకోవడం అనేది మాములు విషయం కాదు. దీనికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఉన్నవారికే ఇందులో చోటు దక్కుతుంది. ఏడాదిలో కనీసం మూడు టెస్టులు, ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడిన ప్లేయర్‌కు మాత్రమే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌.

ఫస్ట్‌ టైమ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నది వీరే…

ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి ఏడాది కాలంలో నాలుగు వన్డేలు, 12 టీ20లతో గ్రేడ్ సీలో క్వాలిఫై సాధించాడు. వరుణ్ చక్రవర్తితో పాటు హర్షిత్ రాణా, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, పాటీదర్‌ ఫస్ట్ టైమ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో అడుగుపెట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com